చంద్రబాబునాయుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాష్ట్ర కమిటీలను ఏర్పాటుచేసే పనిలో నిమగ్నం అయి ఉన్నారు. విజయవాడలోని క్యాంపుకార్యాలయంనుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్న ఆయన ఖాళీ సమయంలో పార్టీ కమిటీలను పూర్తిచేసి... క్రియాశీలంగా ముందుకెళ్లేలా వారికి దిశానిర్దేశం చేయడం గురించి సమయం వెచ్చిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం నాడు తెలంగాణ తెలుగుదేశం నాయకులందరూ కలసి విజయవాడకు వెళ్లి చంద్రబాబును కలిశారు. తెలంగాణ తెదేపాకు సంబంధించి అనేక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. అందులో ప్రధానమైంది.. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుని నియమించాలనే నిర్ణయానికి అధినేత రావడం. పార్టీ తరఫున ఐవీఆర్ ఎస్ సర్వే నిర్వహించి.. అందులో ముందంజలో ఉన్న నాయకుడినే రాష్ట్ర అధ్యక్షుడు చేస్తాం ని చంద్రబాబు తెలంగాణ పార్టీ నేతలతో చెప్పారుట. 3,4 రోజుల్లో 65 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటుచేస్తాం అన్నారుట. బహుశా ఐవీఆర్ ఎస్ ద్వారా అధ్యక్ష పదవి కోసం సర్వే కూడా ఈలోగా పూర్తయిపోవచ్చు.
పద్ధతి బాగానే ఉంది. ఆధునిక సాంకేతిక విప్లవాన్ని పార్టీ నిర్వహణ కోసం చంద్రబాబునాయుడు చాలా సమర్థంగా వాడుకుంటున్నారనే అనుకోవాలి. ఎందుకంటే.. ప్రధానంగా పార్టీ కార్యకర్తల మనోభిప్రాయాలు తెలుసుకుని.. అధ్యక్షుడిని నియమిస్తే.. వారందరూ కూడా ఎక్కువ అంకిత భావంతో పార్టీ కోసం పనిచేసే వాతావరణం ఏర్పడుతుంది. ఇది కచ్చితంగా పార్టీకి లాభమే.
అయితే కార్యకర్తలో కలుగుతున్న సందేహం ఏంటంటే.. ఏపీలో కూడా చంద్రబాబునాయుడు ఇదే ఐవీఆర్ ఎస్ విధానం ద్వారా పార్టీ అధ్యక్షుడిని ఎన్నిక చేయగలరా? లేదా? అనేది.!! పార్టీ అధ్యక్షుడిగా జనం ఎవరికి ఓటేస్తే వారిని పెట్టేయడం అనేది తెలంగాణలో చేసినంత ఈజీగా, ఏపీలో చేస్తే కుదరదు. ఇక్కడంటే.. కేవలం తమది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం తప్ప మరో ఎజెండా లేని పార్టీ. ఎవరికి బాధ్యత ఇచ్చినా సరిపోతుంది. కానీ ఏపీలో తమది అధికారంలో ఉన్న పార్టీ. ఎంతగా నిర్ణయాధికారాలన్నీ కేంద్రకమిటీ చేతిలో ఉండేటప్పటికీ.. ఏపీ అధ్యక్షుడు అనే పదవి చాలా కీలకమైనది. ఆ పదవిలో అధినేతకు అత్యంత విధేయంగా ఉండగల నాయకుడు మాత్రమే కావాలి. మరి అలాంటి స్పెసిఫిక్ లక్షణాల్ని కోరుకుంటున్నప్పుడు.. ఇక ఐవీఆర్ ఎస్ ద్వారా ఏపీలో ఎంపిక చేయడం సాధ్యంకాదేమోనని పార్టీ వర్గాలుపేర్కొంటున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడి విషయంలో అధినేత ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. కిమిడి కళా వెంకట్రావు పేరు పట్ల సానుకూలంగా ఉన్నారని, ఏదైనా అద్భుతం జరిగితేతప్ప... కళా పేరు ఖరారు అవుతుందని చెప్పుకుంటున్నారు.