నాకు సరే.. పవన్ కు నాపై ఉండొద్దా ‘ప్రేమ’: చంద్రబాబు

Update: 2022-01-06 16:09 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబుకు ఓ టీడీపీ కార్యకర్త ఊహించని ప్రశ్న సంధించాడు. దానికి చంద్రబాబు అంతే ఆసక్తికరంగా స్పందించాడు. ఇప్పుడా సమాధానం వైరల్ అవుతోంది.

జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వెళ్లొచ్చు కదా అని ఓ తెలుగు తమ్ముడు చంద్రబాబును ఆప్యాయంగా అడిగాడు.. దానికి చంద్రబాబు సరదాగా స్పందించాడు. 'అరే.. తమ్ముడు.. ప్రేమ అనేది రెండు వైపులా ఉండాలి కదా.. నావైపు ఉంటే ఎలా.. రెండు వైపులా ఉంటేనే అది ప్రేమ అవుతుంది.. లేదంటే వన్ సైడ్ లవ్' అవుతుంది అని చంద్రబాబు సమాధానమిచ్చాడు.

దీన్ని బట్టి చంద్రబాబు జనసేనాని పవన్ తో పొత్తుకు రెడీగా ఉన్నాడని.. పవన్ వైపు నుంచే ఆ క్లారిటీ రావాలని స్పష్టత నిచ్చాడు. 2024లో జగన్ ను ఎదురించడానికి పవన్ తో కలిసి వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు.

దీంతో జనసేనతో పొత్తుపై చంద్రబాబు బంతిని పవన్ కళ్యాణ్ కోర్టులోనే వదిలేశాడు.. పవన్ పొత్తుకు అంగీకరిస్తాడా? వచ్చే ఎన్నికల నాటికి కలిసి వస్తాడా? అన్నది వేచిచూడాలి. కానీ ఏపీ రాజకీయాల్లో పవన్ తో పొత్తు గురించి ఆసక్తి కనబరిచిన చంద్రబాబు మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Full View
Tags:    

Similar News