అర్థరాత్రి వేళ.. వెలువడిన విష వాయువుతో భోపాల్ మహానగరం ఏమైందో తెలిసిందే. మరీ.. అంత కాకున్నా.. తాజాగా విశాఖ మహానగరంలో డేంజర్ పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ కావటంతో విశాఖ నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఉదంతంలో.. గాఢ నిద్రలో ఉన్న వారు అసలేం జరుగుతుందో అర్థం కాకుండానే ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చూస్తుండగానే ఒంటి మీద దద్దుర్లు.. ఊపిరి ఆడకపోవటం.. గాలి కోసం తలుపు తీసిన వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.
రసాయన వాయువు ప్రభావంతో ఏం చేయాలో తోచని స్థితిలో చాలా మంది రోడ్ల మీద పరుగులు పెట్టారు. కొందరు సొమ్మసిల్లి పడిపోతే.. మరి కొందరు రసాయన తీవ్రతకు రోడ్ల మీదనే పడిపోయారు. ఈ పరిశ్రమ ఉన్న ఐదు కిలోమీటర్ల ప్రాంతమంతా రసాయన ప్రభావం నెలకొంది. రసాయన వాయువును పీల్చిన పశువులు వందలాదిగా నురుగలు కక్కుతూ మరణించినట్లుగా తెలుస్తోంది.
పలువురు పెద్ద వయస్కులు..చిన్నారులు.. మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్య సాయం అందేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. తెల్లవారు జామున జరిగిన ఉదంతంలో ఇప్పటివరకూ ముగ్గురు మరణించినట్లుగా తెలుస్తోంది. రసాయనాన్ని ఎంతమంది పీల్చి.. ఇళ్ల్లల్లోనే ఉండిపోయారో అర్థం కాని పరిస్థితి. దీంతో.. పలువురి ఇళ్ల తలుపుల్ని బద్ధలు కొట్టి మరీ.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాధితుల సంఖ్య మరికాసేపట్లో భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. భోపాల్ అంత కాకున్నా.. ఆ ఉదంతాన్ని గుర్తు చేసే పరిణామాలు కనిపిస్తున్నట్లుగా స్థానికులు వాపోతున్నారు.