జగన్ శిబిరం ఆనందంలో ఉంది. ఆయన అనుయాయులు, అనుకూలురు అప్పుడే సంబరాలు మొదలుపెట్టారు. ఇటీవల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను జగన్ కలిసినప్పుడు ‘సీఎం.. సీఎం’ అంటూ నేతలు పొగడ్తలతో ముంచెత్తడం.. జగన్ చిరుమందహాసం చేయడం ఆ వీడియో వైరల్ గా మారడం.. జరిగిపోయింది. ఇవే కాదు వైసీపీ అభిమానుల చిత్రాలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి..
తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతో రూపొందించిన నేమ్ ప్లేట్ వైరల్ గా మారింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ రాసున్న నేమ్ ప్లేట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీన్ని వైఎస్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా ఎంతో పేరు సంపాదించిన జగన్ ఈసారి ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తాడని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో తేలింది. ఈ ఎన్నికల గాలి కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా గెలిచి రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వస్తాడనే నమ్మకం బలపడింది. అందుకే జగన్ ప్రమాణ స్వీకారమైన ‘వైఎస్ జగన్ అనే నేను..’ అంటూ ట్యాగ్ లైన్లు - వాయిస్ ఓవర్లు వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రశాంత్ కిషోర్ తో సక్సెస్ వేడుకల్లో జగన్ ఒక అడుగు ముందుకెశాడు. 2024లో గెలవడానికి ఇప్పటి నుంచే వ్యూహరచనపై చర్చించారట.. అయితే దీన్ని టీడీపీ అభిమానులు ట్రోలింగ్ చేస్తూ అంత అత్యుత్సాహం పనికిరాదంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరి జగన్ కలలు నిజమవుతాయా లేదా అన్నది మే 23న తేలనుంది. అప్పటివరకు వేచిచూడాల్సిందే..