కొరడా దెబ్బలు తిన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి!

Update: 2022-10-25 10:06 GMT
ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు భూపేశ్‌ బఘేల్‌ కొరడా దెబ్బలు తినడం సంచలనంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కొరడా §ð బ్బలు ఆయన తిన్నారు. అయితే ఇది ఆయన తన ఇష్టపూర్వకంగా చేసిందే.

వివరాల్లోకి వెళ్తే..æ తన చేతి మణికట్టుపై ఐదుసార్లు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ కొరడాతో కొట్టించుకున్నారు. ఆయన దుర్గ్‌ జిల్లాలోని జజంగిరి, కుమ్హారి అనే రెండు గ్రామాలలో జానపద సంప్రదాయంలో భాగంగా ఇలా కొరడా దెబ్బలు తిన్నారు. గౌరి పూజ సమయంలో ఇలా కొరడాతో కొట్టించుకుని దెబ్బలు తింటే మంచి జరుగుతుందని స్థానికులు నమ్ముతారు.

ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ తన చేతి మణికట్టుపై కొరడాతో ఐదుసార్లు కొట్టించుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా దుర్గ్‌ జిల్లా జజంగిరి గ్రామంలో గోవర్ధన పూజలో పాల్లొని కొరడా దెబ్బలు తింటే అన్ని కష్టాలు తొలగిపొయి అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ నమ్మకంలో భాగంగా జజంగిరి గ్రామనికి వెళ్లిన సీఎం భూపేష్‌ బఘేల్‌ గోవర్ధన పూజ చేసి ఐదు కొరడా దెబ్బలు తిన్నారు.

ఏది ఏవైనా ఒక రాష్ట్ర సీఎంగా ఉండి కొరడా దెబ్బలు తీనడం అశ్చర్యం కలిగిస్తోంది. అందులోనూ కాంగ్రెస్‌ సీఎంగా ఉండి ఇలాంటి నమ్మకాలు పాటించడం అరుదే. వాస్తవానికి బీజేపీ నేతలకు ఇలాంటి సెంటిమెంట్లు, చాదస్తాలు ఎక్కువ.

అలాంటిది ఒక కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి గిరిజనుల విశ్వాసాలను పాటిస్తూ కొరడా దెబ్బలు తినడం గొప్ప విషయంగానే చెప్పాలి అని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పోలిస్తే ఒకరినొకరు తిట్టుకోవడం, బూతులు మాట్లాడటం, ఏడ్వడం ఇలాంటివి చూసే బదులు ప్రజల విశ్వాసాలను పాటిస్తూ కొరడా దెబ్బలు తినడం గొప్ప విషయమేనంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Tags:    

Similar News