భార‌త్‌ కు ఆ ఛాన్స్ లేకుండా చేస్తున్న చైనా

Update: 2017-06-06 04:43 GMT
అగ్ర‌రాజ్యాల స‌ర‌స‌న నిలిచిన చైనా.. భార‌త్ ఎదుగుద‌ల‌ను ఏ మాత్రం స‌హించ‌టం లేదు. మ‌న‌కంటే ముందున్న డ్రాగ‌న్ దేశం.. భార‌త్ అవ‌కాశాల్ని దెబ్బ తీస్తోంది. అంత‌ర్జాతీయంగా ఉన్న కొన్ని ప‌రిమితుల్ని ఆస‌రాగా చేసుకొని.. భార‌త్ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసేందుకు ఏం చేసేందుకైనా సిద్ధ‌ప‌డుతోంది. తాజాగా అలాంటి ప‌నే చేసింది చైనా. న్యూక్లియ‌ర్ స‌ప్ల‌య‌ర్స్ గ్రూపులో స‌భ్య‌త్వం సాధించేందుకు భార‌త్ చేసే ప్ర‌య‌త్నాల్ని మ‌రోసారి అడ్డుకుంది దొంగ‌బుద్ధి ఉన్న డ్రాగ‌న్‌.

ఇప్ప‌టికే ఒక‌సారి భార‌త్‌ కు నో అన్న చైనా.. మ‌రోసారి న్యూక్లియ‌ర్ స‌ప్ల‌య‌ర్స్ గ్రూపు (ఎన్ ఎస్ జీ)లో స‌భ్య‌త్వానికి భార‌త్‌ కు మ‌ద్ద‌తు ఇవ్వం అంటూ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ఎన్ ఎస్ జీలో భార‌త్‌ కు స‌భ్య‌త్వం క‌ష్టంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్పుదు. భార‌త్‌ కు తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌నే విష‌యాన్ని త‌న‌దైన శైలిలో చెప్పిన చైనా.. గ‌తంలో ఊహించిన దాని కంటే ఇప్పుడు ప‌రిస్థితి సంక్లిష్టంగా మారింద‌ని.. కొత్త విధానాలు.. కొత్త ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని చైనా పేర్కొంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో భార‌త్‌ కు అవ‌కాశం క‌ష్ట‌మేన‌ని పేర్కొంది. ఇదిలా ఉంటే.. మ‌రోవైపు ఎన్ ఎస్ జీలో స‌భ్య‌త్వానికి పాకిస్థాన్ సైతం ద‌ర‌ఖాస్తు చేసుకుంది.

పాకిస్థాన్‌ కు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని చైనా చెప్ప‌లేదు కానీ భార‌త్ విష‌యంలో మాత్రం వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తూనే ఉంది. ఈ మ‌ధ్య‌న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ లో చైనా తీవ్రంగా వ్య‌తిరేకించే ద‌లైలామా ప‌ర్య‌ట‌న‌కు భార‌త్ ఓకే చేయ‌టం.. దీనిపై చైనా వ్య‌క్తం చేసిన అభ్యంత‌రాల్ని భార‌త్ పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌టంపై డ్రాగ‌న్ దేశం ర‌గిలిపోతోంది. ద‌లైలామా ప‌ర్య‌ట‌న‌పై త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన చైనా.. అందుకు ప్ర‌తిగా భార‌త్‌ను ఇరుకున ప‌డేయటం కోసం.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కొన్ని ప్రాంతాల‌కు చైనా పేర్ల‌ను పెడుతూ అధికారికంగా ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

ఇలా రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు అంతంత‌మాత్రంగా ఉన్న వేళ‌.. భార‌త్‌కు కీల‌కాంశాల్లో చైనా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని అనుకోవ‌టం ప‌గ‌టిక‌లే అవుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. ఈ విష‌యంపై చైనాతో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని భార‌త్ చెబుతోంది. ఎన్ని చ‌ర్చ‌లు జ‌రిపితే మాత్రం చైనా చిన్న బుద్ధిని మార్చ‌గ‌లమా? అందులోకి భార‌త్ అంటే ఎప్పుడూ అసూయ‌తో ర‌గిలిపోయే డ్రాగ‌న్ దొంగ‌బుద్ధి మారుతుందా? అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News