దరిద్రపు బుద్దిని ప్రదర్శించిన డ్రాగన్!

Update: 2019-08-07 04:26 GMT
మీ సొంతిట్లో మీరు వాస్తు కారణంగా మార్పులు చేసుకుంటున్నారనుకోండి. పక్కింటోడు వచ్చి.. వాస్తు మార్పులు చేసుకుంటావా?  అయినా.. ఇదేమైనా నీ జాగీరా? అని అడిగితే ఎలా ఉంటుంది?  ఎవరి సొంతిల్లును వారు చక్కదిద్దుకోకుండా పక్కింటోడు వచ్చి బాగుచేయడుగా? ఒకవేళ చేస్తే.. అందులో ఏదో లెక్క ఉండి ఉండాల్సిందే. పక్కనోడు బాగుపడిపోతున్నాడటం ఏడ్చే జనాలకు తగ్గట్లే.. ఒకదేశం కీలక నిర్ణయం తీసుకొని.. దశాబ్దాల నాటి దరిద్రాన్ని ఒక లెక్కగా సెట్ చేస్తుంటే.. తట్టుకోలేని తీరు డ్రాగన్ దేశం చైనాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పాలి. తాజాగా ఆర్టికల్ 370లోని అంశాల్ని మార్చిన వైనం తెలిసిందే.

మోడీ సర్కారు తీసుకున్న ఈ సాహసోపేతమైన చర్యను యావత్ దేశం హర్షిస్తుంటే.. చైనా మాత్రం తన దరిద్రపు బుద్ధిని మరోసారి చాటుకుంది. అంతేకాదు.. ఎప్పటికి భారత నమ్మలేని దుష్ట డ్రాగన్ అన్న భావన కలిగేలా చేసిందని చెప్పాలి. కశ్మీర్ పై భారత పార్లమెంటు తాజాగా ఆమోదించిన బిల్లుల నేపథ్యంలో చైనా దారుణ వ్యాఖ్యలు చేసింది. విన్నంతనే ఒళ్లు మండేలా  ఉన్న ఈ అంశాల్లోకి వెళితే.. కశ్మీర్ విషయంలో భారత తీరు తమ సార్వభౌమత్వాన్ని బలహీనపరిచేలా ఉందంటూ చైనా విదేశాంగ శాఖ కార్యదర్శి తన అక్కసును ప్రకటన రూపంలో చేశారు. చైనా దరిద్రపుగొట్టు వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. నోట మాట రాని రీతిలో వ్యాఖ్యలు చేసింది.

జమ్ముకశ్మీర్ విభజన.. లద్దాఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించటం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని.. ఇందులో వేరే దేశాలు జోక్యం చేసుకోవటాన్ని ఏ మాత్రం అంగీకరించమని చైనాకు వార్నింగ్ ఇచ్చేసింది. ఇతర దేశాలేవీ భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న విదేశాంగ శాఖ.. తాము కూడా ఇతర దేశాల అంతర్గత వ్యవహారంలో కలుగచేసుకోమన్న వైనాన్ని గుర్తు చేశారు. జమ్ముకశ్మీర్ విభజన.. లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించటమనే అంశం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని.. అందులో ఇతర దేశాలు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేవని తేల్చి చెప్పారు.  తాజా పరిణామాలపై ప్రపంచ దేశాలన్నీ భారత అంతర్గత వ్యవహారంగా తేల్చి చెబితే.. చైనా మాత్రం అందుకు భిన్నంగా చేసిన వ్యాఖ్యలపై భారత సర్కారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కటువైన మాటలతో భారత స్పందనకు చైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News