ఇండియాలో పనిచేస్తున్న ముగ్గురు చైనా జర్నలిస్టులను తమ దేశం విడిచిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించడం అనుకున్నట్లుగానే రెండు దేశాల మధ్య మాటల యుద్దానికి, ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. భారత్ నిర్ణయంపై చైనా కూడా సీరియస్ గానే రెస్పాండైంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణమిస్తున్నామని చైనా అంటోంది. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువాకు చెందిన ముగ్గురు జర్నలిస్టులను ఈ నెలాఖరులోగా దేశం విడిచి పోవాలని భారత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో చైనా ఈ నిర్ణయాన్ని తప్పు పట్టింది. తమ ముగ్గురు విలేకరులకు వీసాలను పొడిగించకుండా ఇండియా నిర్ణయించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చైనా ప్రభుత్వ దినపత్రిక 'గ్లోబల్ టైమ్స్' రాసింది.
అయితే.. భారత్ నిర్ణయంపై ఇండియన్ మీడియాలోనూ భిన్న కథనాలు వస్తున్నాయి. ఎన్ ఎస్ జీ(అణు పరిజ్ఞాన సరఫరాదారుల కూటమి)లో భారత్ చేరడానికి చైనా సహకరించకపోవడం వల్లే అందుకు ప్రతీకారంగా ఈ చర్య తీసుకున్నారని కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. భారత్ నిర్ణయంపై చైనా మీడియాలోనూ వ్యతిరేక కథనాలు వచ్చాయి. ఎన్ ఎస్జీ సభ్యత్వం విషయంలో భారత్ నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే అందుకు ఇది సరైన విధానం కాదని.. జర్నలిస్టుల వీసా రెన్యువల్ తిరస్కరణకు ఎలాంటి అధికారిక కారణాలనూ వెల్లడించలేదని అంటున్నారు. ఢిల్లీ - ముంబై తదితర ప్రాంతాల్లోని నిషేధిత ప్రదేశాల్లో తప్పుడు పేర్లతో పర్యటించారని ఇండియాలోని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. టిబెటన్ విప్లవకారులతో ఈ చైనా జర్నలిస్టులు టచ్ లో ఉన్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
భారత్ నిర్ణయం సరికాదన్న కోణంలో చైనాలోని అన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. రెండు దేశాల మధ్యా ఉన్న సంబంధాలు తెగిపోయేందుకు కూడా ఈ పరిణామం దారితీస్తోందని గ్లోబల్ టైమ్సు ఎడిటోరియల్ లో రాశారు. ముఖ్యంగా ఎన్నెస్జీలో సభ్యత్వం విషయంలో చైనా నుంచి వ్యతిరేకత రావడం వల్లే భారత్ ప్రతీకారణంగా ఈ పని చేసిందన్న అభిప్రాయమే ఎక్కువగా వ్యక్తమవుతోంది. చైనా ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని ఆ దేశ జర్నలిస్టులపై చూపించారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.