రాజధాని అమరావతి, విజయవాడ నగరాల్లో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టుపై చైనా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. చైనాలో అనేక మెగా మెట్రో ప్రాజెక్టులు, స్పీడ్ ట్రెయిన్ కారిడార్లు, బుల్లెట్ ట్రయిన్ ప్రాజెక్టులు నిర్మంచిన ప్రముఖ చైనా సంస్థ 23 బ్యూరో గ్రూప్ కంపెనీ లిమిటెడ్ రెండు నగరాల్లోనూ మెట్రో కారిడార్ల నిర్మాణంతోపాటు స్పీడ్ ట్రయిన్ల నిర్మాణంలో భాగస్వామి కావాలని భావిస్తోంది. జిలిన్ యేయే ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్టు కంపెనీ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలని ఈ కంపెనీ నిర్ణయించింది.
ఈ కంపెనీల ప్రతినిధి బృందాలు ఇప్పటికే విజయవాడ వచ్చాయి. రాజధాని ప్రాంతంలో పర్యటించాయి. ఇక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాయి. మెట్రో రైలు టెండర్లలో పాల్పంచుకోవాలని నిర్ణయించాయి. వీజీటీఎం హై స్పీడ్ రైలు ప్రాజెక్టుపై కూడా ఈ కంపెనీల కన్ను వేశాయి.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పట్లోనే నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టాలంటూ చైనా కంపెనీలను ఆహ్వానించారు. దాంతో ఆయా కంపెనీలు విజయవాడకు తరలి వచ్చాయి. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు ప్రాంతంలో కలియదిరిగాయి. ఇప్పటి వరకు విజయవాడ మెట్రోను డీఎంఆర్ సీయే నిర్వహిస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు చైనా, జపాన్ కంపెనీలు కూడా ముందుకు వస్తే వాటికి కూడా గ్లోబల్ టెండర్లు పిలవాల్సిన పరిస్థితి రావచ్చని భావిస్తున్నారు.