తమ్ముడ్ని వదిలేసి అన్నయ్య జంప్!
కీలక ఎన్నికల వేళ.. తమ్ముడు పవన్ కు అన్నయ్య చిరు అండగా నిలుస్తారన్న టాక్ ఒకవైపు.. లేదు లేదు అందరి అంచనాలకు భిన్నంగా జగన్ కు అనుకూలంగా చిరు గళం విప్పే అవకాశం ఉందన్న మాట మరోవైపు.. ఈ రెండు తప్పు. తమ్ముళ్లు నాగబాబు.. పవన్ లు పోటీ చేస్తున్న నియోజకవర్గాల వరకూ వెళ్లి.. ఎన్నికల ప్రచారం చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే.. ఈ వార్తల్లో ఏ మాత్రం పస లేదన్న నిజం ఒకటి బయటకు వచ్చింది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పవన్ నేతృత్వంలోని జనసేనకు మెగా క్యాంప్ దూరంగా ఉండాలని డిసైడ్ చేసిన సంగతి తెలిసిందే. చివరకు తన తండ్రి ఎన్నికల బరిలో ఉన్నా.. షూటింగ్ లో బిజీ అంటూ వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్లిపోయిన విషయం ఆసక్తికరంగా మారితే.. తాజాగా చిరు సైతం అదే దారిలో పయనిస్తున్నట్లు చెబుతున్నారు.
తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన మాటపైనే చిరు నిలబడి ఉంటారని చెబుతున్నారు. ఇందులో భాగంగా తన మీద అనవసర ప్రచారాలు జరగకుండా ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో ఒకట్రెండు రోజుల వ్యవధిలో విదేశాలకు వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఫారిన్ ట్రిప్ కు వెళ్లనున్న చిరు.. ఎన్నికల వ్యవహారం ముగిసే వరకూ విదేశాల్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. పాలిటిక్స్ కు దూరంగా ఉండాలన్న తన నిర్ణయాన్ని పక్కాగా అమలు చేయటం కోసమే తాజా ఫారిన్ టూర్ అన్న మాట వినిపిస్తోంది. ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవటాన్ని ప్రశ్నించే వీలుందని.. ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు వీలుగా విదేశాలకు చిరు పయనం కానున్నట్లు చెబుతున్నారు.తమ్ముళ్లను తమ్ముళ్ల దారికి వదిలేసి అన్నయ్య విదేశాలకు జంప్ కావటం మెగా అభిమానులకు కాసింత నిరాశకు గురి చేస్తుందంటున్నారు.