చంద్రబాబు - ఐఆర్ ఎస్ కు బిగుస్తున్న సీఐడీ ఉచ్చు

Update: 2020-02-02 06:28 GMT
గత చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి(ఈడీబీ) సీఈవోగా ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. 1990 బ్యాచ్ కు చెందిన ఈ ఐఆర్ఎస్ అధికారిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వైసీపీ సర్కార్ గద్దెనెక్కాక ఇతడిని సస్సెండ్ చేసింది.

సస్సెండైన ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఎకనామిక్ ‌డెవలప్మెంట్ బోర్డ్ లో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ తులసీరాణీ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. డిసెంబరు 2019లో కృష్ణా కిషోర్ పై సీఐడీ కేసు నమోదైంది. అంతేకాకుండా ప్రభుత్వం ఆయనను ఏపీ పరిశ్రమలు, మౌళిక వసతుల శాఖ నుంచి తొలగించింది.

తాజాగా ఐఆర్ఎస్ అధికారి కృష్ణా ‌కిషోర్ కేసులో  సిఐడి ఆధారాలు సేకరించింది.  ఈడీబీలో తనకు అనుకూలంగా ఉన్న వారిని రిక్రూట్ చేసున్నారని, 90 మంది వరకు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని‌ నియమించుకుని‌ వర్క్ ఆర్డర్స్ లో గోల్ మాల్ చేసినట్లు కృష్ణా కిషోర్ పై ఫిర్యాదులు అందాయి.

ఎకనామిక్ బోర్డ్ నుంచి ఇచ్చిన వర్క్ ఆర్డర్స్ లో ఎక్సెస్ అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వడంతో పాటు‌ మెటీరియల్ ప్రిటింగ్లో టెండర్లు పిలవకుండా అమౌంట్ అంతా మిస్ ప్రోపరేట్ చేసినట్లు రెండో ఫిర్యాదు అందింది.

ఐఆర్ ఎస్ అధికారి కృష్ణా కిషోర్ 60 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసినట్లు  సిఐడి విచారణలో వెలుగుచూసింది. వాటిలో కొన్ని‌‌ అధికారికంగా రికార్డు ఉన్నా, కొన్నింటికి‌ రికార్డు లేనట్లు సిఐడి గుర్తించింది.
 
కృష్ణ కిశోర్ హైదరాబాదు కళాజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ లో‌ 48 సార్లు 70లక్షల వరకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చినట్లు సీఐడీ గుర్తించింది. ఐఅండ్ పీఆర్ నుంచి‌ కాకుండా నేరుగా కృష్ణా కిషోర్ యాడ్స్ ఇచ్చినట్లు గుర్తించారు. ఇండస్ట్రీస్ ప్రమోషన్ లో‌ యాడ్స్ ఇవ్వాలి, కానీ కృష్ణా కిషోర్ అదర్ యాక్టివిటీస్ లో కూడా ఎక్కువగా ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు.

ఐ అండ్ పి‌ఆర్ కు తెలియకుండా మార్చి 2019లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ‌గ్రూప్ కి చెందిన ది సండే స్టాండర్డ్స్ ఢిల్లీ వీక్లి పేపర్ వారికి 11 యాడ్స్ ఇచ్చి 1కోటి 78 లక్షలు  కృష్ణా కిషోర్ అప్పనంగా కట్టబెట్టినట్టు సీఐడీ విచారణలో తేలింది.  ది సండే స్టాండర్డ్స్ ఢిల్లీ వీక్లి పేపర్ కి యాడ్స్ ఇచ్చిన కృష్ణ కిశోర్.. చంద్రబాబు పెట్టిన సంక్షేమ పథకాల్లో ఇంగ్లీషులో కాకుండా తెలుగులో కావాలని అడిగారు. తెలుగు ప్రింటింగ్ లేకపోవడంతో 24 లక్షల రూపాయలకు సండే స్టాండర్డ్స్ ‌వారు విజయవాడలో ఉన్న  ఓ‌కంపెనీకి‌ తెలుగులో ప్రింటింగ్ ‌కి ఆర్డర్ ఇచ్చినట్లు  సిఐడి గుర్తించింది. ఎవరైన అడిగితే ఆ బుక్ మాకు ఇవ్వలేదని చెప్పాలంటూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గరలోని నోవాటల్ హోటల్లో కృష్ణా కుమార్ బంధువు భాస్కర్, అడ్వకేట్ శ్రీనివాస్ ప్రింటింగ్ ప్రెస్ వారితో సంతకాలు చేయించుకున్నట్టు సీఐడీ గుర్తించింది.

చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉండగా 9 కోట్లకు వర్క్ ఆర్డర్ కు 16 కోట్లు ఇచ్చిన‌ కృష్ణ కిషోర్ తీరును సీఐడీ గుర్తించింది. అంతేకాకుండా ముంబై తాజ్ హోటల్ నుంచి కుక్స్ ని దావోస్ తీసుకెళ్లి 5 రోజులకు గానూ కోటి రూపాయిలు పే చేసిన కిషోర్ అధికార దుర్వినియోగాన్ని సీఐడీ నిగ్గు తేల్చింది.

ఈ ఆరోపణలపై కేసు నమోదైన కృష్ణ కిషోర్ హైకోర్టుకెళ్లాడు. ప్రస్తుతం కృష్ణా కిషోర్ కు‌ ఫిబ్రవరి 6 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది.
 
ఫిబ్రవరి ‌6 తర్వాత హైకోర్టు ఆదేశాలతో కృష్ణా కిషోర్ ను అదుపులోకి‌ తీసుకుని నిధుల గోల్ మాల్ పై సీఐడీ విచారించే  అవకాశం ఉంది. అప్పుడు ఈ ఐఆర్ఎస్ అధికారి బాగోతం.. చంద్రబాబు బాగోతం బయటపడే చాన్స్ ఉంది.


Tags:    

Similar News