నిమ్మగడ్డ లేఖ రచ్చ...పీఏను విచారించిన ఏపీ సీఐడీ!

Update: 2020-05-03 09:30 GMT
అన్నీ బాగా మేనేజ్ చేశారు గాని ఆ ఒక్కటీ తేడా వచ్చిందన్నట్లు ఉంది ఏపీలో నిమ్మగడ్డ వ్యవహారం. గతంలో ఏపీ గవర్నమెంటు మీద సంచలన ఆరోపణలు చేస్తూ అప్పటి ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, ఆ లేఖలో వాడిన భాష - పొందుపరిచిన సమాచారం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏపీ సీఐడీ ద్వారా విచారణ జరుపుతోంది.

 ఆ లేఖ తానే రాసినట్లు ఒకరితో - తనకు సంబంధం లేనట్లు ఒకరితో...అనుమానాస్పదంగా మాట్లాడారు నిమ్మగడ్డ.  ఆ లేఖ గురించి చాలా రోజులు గుంభనంగా వ్యవహరించిన నిమ్మగడ్డ తర్వాత చాలా కాానికి తానే ఆ లేఖ రాసినట్టు ఒప్పుకున్నారు. పైగా ఆ లేఖకు సంబంధించిన ఆధారాలు ఎన్నికల కమిషనర్ ఆఫీసులో లేకుండా చేయడం వివాదాస్పదం అయ్యింది. దీని రహస్యాన్ని నిగ్గు తేల్చే క్రమంలో సీఐడీ వేగంగా దర్యాప్తు చేస్తోంది. రమేష్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖను ఎవరో నిమ్మగడ్డకు మెయిల్ ద్వారా పంపినట్టు సీఐడీ గుర్తించినట్లు తెలుస్తోంది.  దీంతో లేఖను తయారు చేసిన వ్యక్తి ఐపీ అడ్రస్ కోసం సీఐడీ ప్రయత్నిస్తోంది. ఈ కోణంలోనే కేసును దర్యాప్తు చేస్తు ... ఈరోజు నిమ్మగడ్డ పీఏ సాంబమూర్తిని సీఐడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది.

హైదరాబాద్‌ లోని ఏపీ సీఐడీ ఆఫీసులో సాంబమూర్తిని విచారిస్తున్నారు. ఆయన ద్వారా కొన్ని కీలక విషయాలు వెలుగుచూశాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ కేసు దర్యాప్తు మరింత ముందుకు వెళ్లింది. అవసరమైతే  నిమ్మగడ్డ రమేష్ ను కూడా సీఐడి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... రేపు నిమ్మగడ్డను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై మూడోసారి హైకోర్టులో విచారణ జరగనుంది.


Tags:    

Similar News