సివిల్స్ ఫ‌లితాలు..సీబీఐ మాజీ జేడీ త‌న‌యుడికి ర్యాంక్‌

Update: 2018-04-27 17:38 GMT
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ 2017 తుది ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌ సైట్‌ లో పొందుపరిచింది. తెలంగాణ బిడ్డ‌కు ప్ర‌థ‌మ ర్యాంక్ వ‌చ్చింది. ఈ తుది ఫలితాల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లివాసి దురిశెట్టి అనుదీప్(28) మొదటి ర్యాంక్ సాధించాడు. అనుకుమారి రెండో ర్యాంక్ సాధించగా.. సచిన్ గుప్తా మూడో ర్యాంకు సాధించాడు. ఈ సివిల్స్ ఫలితాల్లో ఇరు తెలుగు రాష్ర్టాల నుంచి పలువురు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. నీలం సాయితేజ 43వ ర్యాంక్, నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంక్, జి. మాధురి 144వ ర్యాంక్, వివేక్ జాన్సన్ 195 ర్యాంకు సాధించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్‌ 196వ ర్యాంక్ సాధించారు.

ఇక  మొత్తం 990 మంది అభ్యర్థులు ఐఏఎస్ - ఐఎఫ్ ఎస్ - ఐపీఎస్ - సెంట్రల్ సర్వీసెస్ - గ్రూప్-ఏ - గ్రూప్-బి పోస్టులకు ఎంపికయ్యారు. మొద‌టి ర్యాంక‌ర్ అయిన అనుదీప్ పదో తరగతి వరకు శ్రీ సూర్యోదయ హైస్కూల్‌లో.. ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో.. బిట్స్ పిలానీ - రాజస్థాన్ నుంచి బీఈపూర్తిచేశాడు. తండ్రి మనోహర్ ప్రభుత్వ ఉద్యోగి(ఏఈ ట్రాన్స్‌కో-మల్లాపూర్), తల్లి జ్యోతి గృహిణి. ఇదిలాఉండ‌గా...యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో టాప్‌లో నిలిచిన దురిషెట్టి అనుదీప్ కు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత - సీఎం కేసీఆర్ త‌న‌యుడు - మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రతిభావంతులకు నిలయమని  అనుదీప్ రుజువు చేశారు అని ప్రశంసించారు. అనుదీప్ సాధించిన విజయం అసమానమైనది అని, ఇది ఖచ్చితంగా తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకం గా నిలుస్తుందన్నారు ఎంపి కవిత. అనుదీప్ విజయం జగిత్యాల జిల్లా కు గర్వకారణం అన్నారు.
Tags:    

Similar News