ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా నష్టపోతామని తెలిసినా తెలంగాణలో లాభపడతామనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటు తొలినాళ్లల్లో కాంగ్రెస్ కు అద్భుత స్పందన ఉంది. అయితే కొన్నాళ్లకు టీఆర్ఎస్ వ్యూహానికి ఆ పార్టీ ప్రభావం కోల్పోతూ వస్తోంది. అప్పటి నుంచి మొదలైన ఆ పార్టీ పతనం ఇప్పుడు గల్లీ పార్టీ మాదిరి అయిపోయింది. రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలకు ఆ పార్టీ తీవ్రంగా దెబ్బతింది. అధికార పార్టీకి దీటుగా రాణించలేకపోతూ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోతోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి ఆశదీపంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కుర్రతనం.. ఫైర్ బ్రాండ్, దూకుడుతనం అన్ని కలిపి పార్టీలో జోష్ ఉన్న నాయకుడు. అలాంటి వ్యక్తి మొదటి నుంచి అధికార పార్టీకి దీటుగా పని చేస్తున్నాడు. గతంలో టీడీపీలో ఉన్నా.. కాంగ్రెస్ లో ఉన్నా నేరుగా కేసీఆర్ ను, కేటీఆర్ ను ఢీకొంటున్నాడు.ఇక్కడి వరకు బాగానే ఉన్నా రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారు. బయట శత్రువుతో పోరాడుతుంటే పార్టీలో ఉన్న వారు గింజుకుంటున్నారు. రేవంత్ రెడ్డి తీరును తప్పు బడుతూ కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడుతున్నట్టు వారి వ్యాఖ్యలు కనిపిస్తాయి.
తాజాగా రేవంత్ రెడ్డి మంత్రి, టీఆర్ఎస్ కార్య నిర్వాహకుడు కేటీఆర్ అక్రమాలు, అవినీతిపై పోరాడుతున్నాడు. ఆ క్రమంలో ప్రభుత్వం కక్షపూరితంగానో.. కాకతాళీయంగానో రేవంత్ రెడ్డి భూ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రేవంత్ రెడ్డి సోదరులు భూములు ఆక్రమించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కేటీఆర్ అక్రమాలను బయటపెట్టేందుకు రేవంత్ రెడ్డి జన్వాడలో బహిరంగంగా నిరూపించేందుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుబట్టారు. సొంత అజెండా వేసుకుని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇష్టానుసారం చేస్తున్నారని సొంత పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి మద్దతుగా నిలబడాల్సింది పోయి విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి జోష్ మీద ఉండగా పార్టీ నాయకుల విమర్శలతో ఆయన డీలా పడే పరిస్థితి ఏర్పడింది.
తాజాగా రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత అంశాలను పార్టీకి అంటగట్టేలా రేవంత్ రెడ్డి చూస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. పార్టీలో చర్చించకుండా ఎలా సమర్థిస్తారంటూ మాజీ ఎంపీ, సీనియర్ నేత వి. హనుమంతరావు, పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి.. దాన్ని దాటవేస్తూ ఇంకొకరిపై నిందలు వేస్తున్నారని ప్రత్యర్థుల మాదిరి సొంత పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. వీరు ఇలా ఉంటే మరికొందరు నాయకులు రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. రేవంత్ రెడ్డి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అతడి అరెస్ట్ అక్రమమంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖండించారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ముగియగానే రేవంత్ రెడ్డి బయటపెట్టిన కేటీఆర్ అక్రమ నిర్మాణాన్ని పరిశీలించడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ కు మద్దతుగా పార్టీ పక్షనేత భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరురాలు ఎమ్మెల్యే సీతక్క, ఇతర ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు.
వీహెచ్, జగ్గారెడ్డికి తోడుగా మరో సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ కూడా తోడై రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు. అధికార పార్టీకి దీటుగా పోరాడుతున్న వ్యక్తికి అండగా నిలబడాల్సిన నాయకులు విమర్శించడం కాంగ్రెస్ నాయకులకే చెల్లు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష మార్పు అంశం నడుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తుండడంతో అతడికే ఇస్తారేమోనని సీనియర్ నాయకులు భావిస్తూ రేవంత్ కు దక్కకుండా ఈ విధంగా విమర్శలు చేస్తూ అడ్డుకుంటున్నారు. ఈ విబేధాలే పార్టీని కొంప ముంచుతున్నాయి. వీరి వైఫల్యం టీఆర్ఎస్ కు కలిసొస్తోంది. అందుకే ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ అపూర్వ విజయాలు సొంతం చేసుకుంటుండగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఫలితాలు పొందుతోంది. వీళ్లు ఎప్పుడు మారుతారో.. పార్టీ నాశనమవుతున్నా పట్టించుకోని నాయకులు వీరే.