హాస్పిటల్ కి సీఎం జగన్‌ .. డాక్టర్స్ ఏం చెప్పారంటే !

Update: 2021-11-12 08:01 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి డాక్టర్స్ వైద్య పరీక్షలు నిర్వహించారు. 2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం ఆయన అమరావతి లో సీఎం క్యాంప్ ఆఫీస్ కి సమీపం లో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సీఎం జగన్ కి వైద్యులు పలు రకాలైన పరీక్షలు చేశారు. ఈ మధ్యనే ఎక్సర్ సైజ్ చేస్తుండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కాలికి గాయమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మడమనొప్పితో బాధ పడుతున్నారు. అయితే మరోసారి కాలి గాయం వద్ద వాపు రావడంతో పరీక్షల కోసం సీఎం జగన్ ఆస్పత్రికి వెళ్లారు. నొప్పి ఎక్కువ కావడం, వాపు రావడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.

దాదాపుగా సీఎం జగన్ హాస్పిటల్ లో రెండు గంటల పాటు ఉన్నారు. దీనితో ఈ రోజు జరగాల్సిన విద్యాశాఖ సమీక్ష ను అధికారులు రద్దు చేశారు. పరీక్షల రిపోర్టులను చూసిన అనంతరం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ కు వైద్యులు సూచించడం తో రద్దు చేశారు. మరోవైపు..భారీ వర్షాలు కురుస్తుండడంతో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. జిల్లాల కలెక్టరలతో సమీక్ష నిర్వహించారు. చిత్తూరు, కడప కలెక్టర్లు, ఇతర జిల్లాల అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచే సమీక్ష చేశారు. తడ, సూళ్లూరుపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని, సహాయ శిబిరాల్లో ఉన్న వారిని మంచిగా చూసుకోవాలన్నారు. వారికి మంచి ఆహారం అందించాలని, బాధితులకు వేయి రూపాయల చొప్పున అందించాలని సూచించారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే.. వెంటనే వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. అత్యవసర సేవలకు అంతరాయం రాకుండా ముందు జాగ్రత్తగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా అధికారులు వెంటనే సంప్రదించాలి. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో అన్ని రకాల సహాయ కార్యక్రమాలు వేగంగా అమలయ్యేలా చూడాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.
Tags:    

Similar News