వెనక్కి తగ్గి కేసీఆర్ ను పిలిచిన గవర్నర్.. సార్ ఏం చేస్తారో మరీ

Update: 2022-03-29 02:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవేశం వచ్చినా.. అనుగ్రహం వచ్చినా అంత ఈజీగా తగ్గించుకోలేరని టాక్. కేసీఆర్ ఎవరి మీద అయినా పగబట్టారనుకో అంతేనంటారు. హుజూరాబాద్ లో ఓటమి తర్వాత కేంద్రంపై ఒంటికాలిపై లేస్తున్నారు కేసీఆర్.ఇక సంప్రదాయాలన్నీ గంగలో కలిపేసి బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ తమిళిసైని కూడా ఆహ్వానించలేదు. బీజేపీ వ్యక్తి అనే గవర్నర్ ను కేసీఆర్ దూరం పెట్టేశారు.

అసలు రాజ్ భవన్ ముఖం కూడా చూడకుండా కేసీఆర్ చాలా దూరంగా ఉంటున్నారు. తమిళిసై తను చెప్పింది వినడం లేదని కోపంతో ఇవన్నీ చేస్తున్నట్టున్నారు. తెలంగాణకు కీలకమైన గవర్నర్, సీఎంలు ఇలా మాట్లాడుకోకపోతే.. సఖ్యతగా లేకుంటే వ్యవస్థకే ప్రమాదం.. ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలంటే వీరిద్దరూ కలిసి పనిచేయాలి. అయితే ఎవరో ఒకరు వెనక్కి తగ్గకుంటే పరిస్థితులు చేజారిపోతాయి.

అయితే పాత పగలన్నీ మరిచిపోయి ఇప్పుడు గవర్నర్ తమిళిసై వెనక్కి తగ్గారు. కేసీఆర్ ను రాజ్ భవన్ లో నిర్వహించే ఉగాది వేడుకలకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. తన ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు.  కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభాన్ని ఆకాంక్షిస్తున్నట్టు సహృద్భావ వాతావరణాన్ని కల్పించారు.

ఈ క్రమంలోనే గవర్నర్ హాట్ కామెంట్స్ చేశారు. 'రాజ్ భవన్ లో ఉగాది వేడుకలకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నా.. ఇది నా మర్యాద. నా ఆహ్వానాన్ని అందరూ స్నేహపూర్వకంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నా అంటూ గవర్నర్ తమిళిసై ఇలా ట్విస్ట్ ఇచ్చారు.  

ఉగాది కొత్త సంవత్సరం వేళ పాత విషయాలను మరించి గవర్నర్ చేసిన ఈ ఆహ్వానాన్ని కేసీఆర్ మన్నిస్తాడా? లేక తిరస్కరిస్తాడా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తనతో వైరం ఉంటే ఎంత పెద్ద నేత అయినా ట్రీట్ మెంట్ ఒకేలా ఉంటుంది. వెనక్కి తగ్గిన గవర్నర్ విషయంలో కేసీఆర్ వ్యవహారశైలి ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి.
Tags:    

Similar News