తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది. అంతగా చర్చ ఎందుకు? ముఖ్యమంత్రి ముందస్తుగా అపాయింట్ మెంట్ తీసుకొని, షెడ్యూల్ సిద్ధం చేసుకొని....ఢిల్లీ వెళ్లడంలో తప్పేముంది? వింత ఏముంది! అనే కదా మీ సందేహం. అలా ముందస్తుగా షెడ్యూల్ ఏదీ సిద్ధం చేసుకోకుండానే, ఆయా నేతలకు చెందిన అపాయింట్ మెంట్లు ఏవీ లేకుండానే కేసీఆర్ ఢిల్లీకి పయనం అయ్యారని అంటున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం ఆరోగ్య కారణాల రీత్యా కేసీఆర్ ఢిల్లీకి శుక్రవారం బయల్దేరి వెళ్లినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం టీఆర్ ఎస్ అధినేత - సీఎం కేసీఆర్ కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కాటరాక్ట్ సమస్యతో గత కొద్దికాలంగా ఇబ్బందులు పడుతున్న కేసీఆర్ ఇందుకు శస్త్రచికిత్స సరైన మార్గమని భావించారని అంటున్నారు. అయితే మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్న హైదరాబాద్ ను కాదని ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటే...హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటే పెద్ద ఎత్తున మీడియా ఫోకస్ చేస్తుంది. సీన్ క్రియేట్ అవుతుంది. అందుకే వీటిన్నింటి నుంచి దూరంగా ఉండేందుకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
ఢిల్లీలోని ఓ ప్రముఖ డాక్టర్ వద్ద అపాయింట్ మెంట్ తీసుకున్న సీఎం కేసీఆర్ ఆయన సూచన మేరకు హస్తినకు శుక్రవారం బయల్దేరి వెళ్లారని అంటున్నారు. చికిత్సలో భాగంగా మైనర్ సర్జరీ ఒకటి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో సుమారు ఐదు రోజుల పాటు ఉండే కేసీఆర్ శస్త్రచికిత్స అనంతరం పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశ ఉందని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/