కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు విద్యాలయాలను కూడా అపవిత్రం చేస్తున్నారు. బాలికల జీవితాలను చిదిమేస్తున్నారు. ఓ ఉద్యోగి నమ్మించి ఆఫీసు వద్దకు పిలిపించి ఓ బాలికపై స్ప్రే కొట్టి కాళ్లు కట్టేసి రేప్ చేశాడు. ఈ దారుణాన్ని మొత్తం వీడియో తీశాడు. బయటకు చెబితే ఆ వీడియోలను బయటపెడతానని బెదిరించడంతో ఆ బాలిక విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక పోయింది. ప్రస్తుతం ఆ బాలిక ఏడు నెలల గర్భిణి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కాట్పాడికి సమీపంలోని ఓ ప్రాంతానికి చెందిన పేదింటి బాలిక సమీపంలోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. కొన్ని నెలల కిందట ఆ బాలిక కళాశాలలో ఉండగా.. కళాశాలకు చెందిన ఓ ఉద్యోగి ఏదో పని ఉందని చెప్పి ఆమెను ఆఫీస్ కార్యాలయం దగ్గరికి ఫోన్ చేసి పిలిపించాడు. అక్కడికి వెళ్లగా ఆ బాలికకు ఎవరూ కనిపించలేదు. లోపలికి వెళ్ళగానే ఆ ఉద్యోగి బాలికపై స్ప్రే కొట్టాడు. ఆమె మత్తులోకి జారగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. మొబైల్లో వీడియో కూడా తీశాడు.
బాలికకు స్పృహ వచ్చేసరికి కాళ్లు కట్టేసినట్లు, ఒంటిపై నూలు పోగు కూడా లేనట్లు అర్థమైంది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పినా, బయట ఎవరి వద్ద అయినా చెప్పినా చంపేస్తానని, ఈ వీడియోని అందరికీ చూపుతానని అతడు బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇటీవల ఆ బాలిక తరచూ అనారోగ్యానికి గురవుతుండటం - కడుపు కొంచెం ముందుకు రావడంతో కుటుంబీకులు వైద్యాధికారుల సాయంతో పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో బాలిక ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి అని తేలింది. ఆ బాలిక జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.