ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్య పరీక్షలు ముగిశాయి. ఊపిరితిత్తులు, ఛాతిలో మంటగా అనిపించడంతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుప్రతికి సీఎం వెళ్లారు. ఈ సందర్భంగా ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు, పల్మనాలజిస్ట్ డాక్టర్ నవనీత్ సాగర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్.. కేసీఆర్ కు ప్రాథమికంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మాగ్నిటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్‌ఐ), కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (సీటీ) స్కాన్ కూడా నిర్వహించారు.
ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ కోసం పలు పరీక్షలు చేశారు. సీఎం బ్లడ్ శాంపిళ్లు కూడా వైద్యులు సేకరించారు. అయితే.. రక్తపరీక్ష, స్కానింగ్ రిపోర్టులు ఇంకా రాలేదు. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్‌కు చికిత్స అందిస్తారని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆసుపత్రికి కేసీఆర్‌తోపాటు కుమారుడు కేటీఆర్, కూతురు కవిత, ఎంపీ సంతోష్ వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం అందరూ తిరిగి ప్రగతి భవన్ కు వెళ్లారు.
కాగా.. ఆసుపత్రికి వెళ్లడానికి ముందు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరయ్యారు. సోమాజీగూడలోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం కేసీఆర్.. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారని, అనంతరం ఊపిరితిత్తులు, ఛాతీలో మంటగా అనిపించడంతో ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం.