కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి గట్టిగా మూణ్నెళ్లు కూడా పూర్తికాకుండానే రాహుల్ గాంధీ అప్పుడే అలసిపోతున్నారు. చిన్నచిన్న విజయాల తరువాత గ్యాప్ తీసుకోవాలని, రిలాక్స్ కావాలని కోరుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఉప ఎన్నికల్లో రెండు సిటింగు స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ట్విటర్లో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆయన ఈ వీకెండ్‌లో తన అమ్మమ్మగారి దేశం ఇటలీ వెళ్లబోతున్నట్లు మరో ట్వీట్‌లో వెల్లడించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై కార్యకర్తలకు అభినందనలు తెలుపుతూ రాహుల్ ట్వీట్ చేశారు. పాలక బీజేపీ ప్రజావ్యతిరేక విధానాల వల్లే ఆ పార్టీకి చుక్కెదురైందని..కాంగ్రెస్‌కు ఘనవిజయం దక్కిందని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేందుకు ఈ ఫలితాలు సంకేతమన్నారు. అనంతరం తన టూరు ప్లాను కూడా తెలిపారు. హోలీ వీకెండును అమ్మమ్మతో గడిపేందుకు వెళ్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఇటలీలో ఉన్న అమ్మమ్మను సర్‌ప్రైజ్ చేసేందుకు అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. 93 ఏళ్ల అమ్మమ్మను కలిసి ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఉందని రాహుల్ ట్వీట్ చేశారు. తన అమ్మమ్మ ఈ ప్రపంచంలోనే దయామయి అని కొనియాడారు. ఆమెను కలిసి ఆప్యాయంగా కౌగిలించుకోవాలనుందని.. అందరికీ హోలీ శుభాకాంక్షలంటూ రాహుల్ ట్వీట్ చేశారు.