ఓ మాజీ మంత్రి బర్త్ డే వేడుకగా అధికార టీఆర్ ఎస్ పార్టీ - ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హైడ్రామా సృష్టించడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ టీఆర్ ఎస్ లో చేరడంతో మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ - ఆయన కుమారుడు - మాజీ కార్పొరేటర్ విక్రంగౌడ్ కూడా టీఆర్ ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే హైదరాబాద్ జిల్లా రాజకీయ హైడ్రామాకు ఆదివారం జరిగిన ముఖేష్ గౌడ్ పుట్టిన రోజు వేడుక వేదికైంది. ఆయన అధికార పార్టీలోకి వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరుగుతుందన్న నేపథ్యంలో టీఆర్ ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావుతో భేటీ దానికి మరింత బలం చేకూర్చింది. ముఖేష్ గౌడ్ తో మైనంపల్లి రహస్య చర్చలు జరిపారని తెలుసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన జాంబాగ్ లోని ముఖేశ్ గౌడ్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 'మిగతా విషయాలు గాంధీ భవన్ లో చర్చించుకుందాం రా' అంటూ ముఖేష్ గౌడ్ ను ఆహ్వానించి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఇంటికి టీఆర్ ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు ఆదివారం వెళ్లారు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన కుమారుడు విక్రంగౌడ్ - ఇతర కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. అనంతరం ముఖేష్ గౌడ్ తో భేటీ అయ్యారు. దీనిపై ముఖేష్ గౌడ్ స్పందిస్తూ...'కాంగ్రెస్ లో నేతల మధ్య కొన్ని అభిప్రాయభేదాలు ఉన్న మాట వాస్తవమే. కానీ, నేను కాంగ్రెస్ లోనే ఉంటా. మైనంపల్లి హనుమంతరావు కేవలం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పటానికే వచ్చాడు' అంటూ చెప్పారు. ఇదే కార్యక్రమం నుంచి బయటకు వెళ్తున్న సందర్భంలో ముఖేష్ గౌడ్ టీఆర్ ఎస్ లో ఎప్పుడు చేరబోతున్నాడు అని మైనంపల్లిని మీడియా ప్రశ్నించగా...'త్వరలోనే ఆ కార్యక్రమం ఉంటుంది' అని చెప్పుకుంటూ వెళ్లటం గమనార్హం.
కాగా, టీఆర్ ఎస్ గ్రేటర్ నాయకుడు - ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు జాంబాగ్ లోని ముఖేశ్ ఇంటికెళ్లి ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కావడం కాంగ్రెస్‌వర్గాల్లో కలకలం రేపింది. విషయం తెలియగానే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - మరికొందరు సీనియర్ నేతలు ముఖేశ్ ఇంటికి వెళ్లి ఆయనను పార్టీ వీడకుండా బుజ్జగించారు. ముఖేశ్ - విక్రమ్ తో ఉత్తమ్ సమావేశమై కాంగ్రెస్ ను వీడొద్దని కోరినట్టు తెలిసింది. మరోవైపు డీకే అరుణ - దామోదర రాజనర్సింహ తోపాటు కొందరు కాంగ్రెస్ నేతలు ముఖేశ్ ఇంటికి వెళ్లి పార్టీ వీడొద్దని ఆయనకు నచ్చజెప్పినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ సమావేశం అనంతరం మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. అనేక మంది బీసీ నేతలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టు తెలిపారు. హైదరాబాద్ లో క్రియాశీలక నాయకునిగా - మంత్రిగా కాంగ్రెస్ పార్టీ తనకు తగిన ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశాలను ఏర్పాటు చేసి.. చివరగా వారి అభీష్టం మేరకు భవిష్యత్ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటానన్నారు.