కాంగ్రెస్ అస్త్రసన్యాసం.. అయిపోయినట్టే?

Update: 2019-10-19 11:09 GMT
సోనియా గాంధీ... కాంగ్రెస్ అధ్యక్షురాలు.. ఆమె రావడం లేదు. ఇక సోనియా తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఎక్కడా కనిపించడం లేదు.. అంతో ఇంతో కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని త్యజించిన రాహుల్ గాంధీ తిప్పలు పడుతున్నాడు. కాంగ్రెస్ సీనియర్లు సైతం గాలికి వదిలేసిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం మాట అటుంచి ఇప్పుడు కనీసం పోటీనిచ్చే అవకాశమే లేదని సర్వేలు చెబుతున్నాయి..

రాహుల్ గాంధీ తన అపరిపకత్వను మరోసారి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా బయటపెట్టుకుంటున్నారన్న చర్చ సాగుతోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల వేళ మోడీ సర్కారు రాఫెల్, జీఎస్టీ, నోట్ల రద్దును ప్రస్తావించారు రాహుల్ గాంధీ. కానీ జనాలు రాహుల్ ఆరోపణలను తిరస్కరించి బీజేపీనే గెలిపించారు. తాజాగా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ వాటినే పట్టుకొని రాహుల్ ప్రచారం చేయడం కాంగ్రెస్ ను మరింత కృంగదీస్తోంది. ఇక రాఫెల్ పై ఓం ఎందుకు రాశారంటూ కేంద్ర రక్షణమంత్రిని రాహుల్ గాంధీ నిలదీయడం కూడా కాంగ్రెస్ కు పెద్ద మైనస్ గా మారింది. హిందుత్వ వాదుల ఓట్లు పడకుండా పోయాయన్న చర్చ సాగుతోంది.

ఇప్పుడు రెండు రాష్ట్రాల ఎన్నికల్లో సోనియా రాక, ప్రియాంక పట్టించుకోక.. సీనియర్లు అటువైపు చూడకపోవడంతో కాంగ్రెస్ ప్రచారం చప్పగా సాగుతోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో యాక్టివ్ గా ఉన్న ప్రియాంక ఈసారి సైలెంట్ గా ఉండిపోవడం కాంగ్రెస్ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది.

పార్టీ అన్నాక గెలుపోటములు సహజం. గెలిచినా.. ఓడినా పార్టీ శ్రేణులకు, ప్రజలకు అండగా ఉన్నవారే నిజమైన నాయకుడు. పార్టీని కష్ట సమయంలో ముందుండి నడిపించిన జగన్ ఇప్పుడు సీఎం అయ్యారు. పదేళ్లు ప్రతిపక్షంలో పోరాడారు. కానీ అధికారం కోల్పోయిన ఐదేళ్లకే కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజారడం చూస్తుంటే ఆ పార్టీ కోలుకునే అవకాశాలు మచ్చుకైనా లేవన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
Tags:    

Similar News