రాజకీయాలు చాలా కరుకుగా.. కటువుగా ఉంటాయన్న వాస్తవం మరోసారి రుజువైంది. మన మధ్యన లేని వారి విషయంలో విమర్శలు ఎందుకంటూ చట్టసభల్లో తరచూ ప్రస్తావిస్తూ.. దివంగత నేతలైన ఇందిరా.. రాజీవ్ గాంధీల గురించి ఎలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వని కాంగ్రెస్ పార్టీ తన వాదనకు భిన్నంగా తాజాగా వ్యవహరించటం గమనార్హం.
స్వాతంత్ర్య సమరంలో అసమాన పోరాటం చేసిన వీడీ సావర్కర్ పై కాంగ్రెస్ తాజాగా నోరు పారేసుకుంది. బీజేపీ.. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతకర్త సావర్కర్ పై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో భగ్గుమనటమేకాదు.. ఆయనపై అనుచిత విమర్శలు చేసింది. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకోవటం గమనార్హం. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని.. ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఇప్పుడో చర్చగా మారింది. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వారిని ఎదిరించి పోరాడిన భగత్ సింగ్ ఉరిశిక్షకు గురైతే.. బీజేపీ.. ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతకర్త సావర్కర్ మాత్రం ఆంగ్లేయుల పాలనలో బానిసగా ఉంటానంటూ తనపై జాలిని ప్రదర్శించాల్సిందిగా వేడుకున్నట్లుగా ఆరోపించారు.
ఒకవేళ సావర్కర్ కానీ ఇలాంటి తీరునే ప్రదర్శించి ఉంటే.. అందుకు తగిన అధికారిక ఆధారాలు చూపించి ఉంటే బాగుండేది. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఎప్పుడో మరణించిన ఒక వ్యక్తిపై ఇంతటి నింద వేయటంపై పలువురు తప్పు పడుతున్నారు. రాజకీయమే ప్రధానమైనప్పుడు విలువులు ఉండే అవకాశమే లేదు కదా. ఇందుకు కాంగ్రెస్ ఏమాత్రం మినహాయింపు కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.