తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడతాయనగా సంచలన పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలతో సంబంధం లేకుండా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు.. టీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులకు వల వేస్తున్నారు. ఈ మేరకు ఓ నాయకుడికి ఎరవేశారు. ఈ కాల్ కు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడం సంచనలంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి సీట్లు తక్కువ పడితే మద్దతివ్వాలని నాగర్ కర్నూల్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డికి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేశారు. జానా రెడ్డి ఇంట్లో మాట్లాడుకుందాం అని తనకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేసినట్లు మర్రి జనార్ధన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వరుసగా రెండుసార్లు విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు తెలంగణ భవన్ లో మర్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ ఎస్ పార్టీ తరపున గెలవబోయే అభ్యర్థులను కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు వత్తాసు పలకకుండా ఆయన మాయలో నుంచి బయటకు రండి అని విశ్వేశ్వర్ రెడ్డికి చెప్పి ఫోన్ పెట్టేసినట్లు మర్రి పేర్కొన్నారు. పదవులకు అమ్ముడుపోయే వ్యక్తిత్వం తమది కాదని.. తమది కేసీఆర్ సైన్యం అని మర్రి జనార్ధన్ రెడ్డి తేల్చిచెప్పారు. లగడపాటి సర్వేలతో ప్రజలను గందరగోళానికి గురి చేసి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం మంచిది కాదన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని.. 80 నుంచి 85 స్థానాలు టీ ఆర్ ఎస్ కైవసం చేసుకుంటుందని మర్రి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.