మోడీ - అమిత్ షా మ‌ర్డ‌ర్‌కు సోనియా - రాహుల్ ప్లాన్ చేశారా...

Update: 2019-09-26 10:29 GMT
ఎప్పుడూ ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాకు ఎక్కే యోగా గురువు బాబా రాందేవ్ బాబా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ - రాహుల్ గాంధీలపై సరికొత్త ఆరోపణలు చేశారు. యూపీఏ హయాంలో మోడీ - అమిత్ షాలని హతమార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అయిన అధికారం సోనియా - రాహుల్ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు.

ఆ సమయంలోనే గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని - ఆయన అనుచరుడు అమిత్ షాలని చంపేసేందుకు వారు ప్రయత్నాలు చేశారని అన్నారు. తప్పుడు కేసుతో అమిత్ షాను జైలుకు పంపిన రాహుల్ గాంధీ - జైలులోనే హతమార్చాలని చూశారని ఆరోపించారు. అప్పుడు రాహుల్-సోనియాలు అలా చేసిన..ఇప్పుడు అధికారంలో ఉన్న మోడీ-అమిత్ షాలు అలా చేయడం లేదని చెప్పారు. అటు ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరంపై కూడా రాందేవ్ విరుచుకుపడ్డారు.

యూపీఏ హయాంలో కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరం అమిత్ షాను జైలుకు పంపారని గుర్తుచేశారు. అయితే మోడీని కూడా జైలుకు పంపించి హతమార్చాలని చూశారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో అమిత్ షాను జైలులో పెట్టిన చిదంబరం - ఇప్పుడు జైలుకు వెళతారని కలలో కూడా అనుకోలేదన్నారు. సోనియా - రాహుల్ కూడా చట్టం ముందు సమానులేనని - మనం చట్టాన్ని ఉల్లంఘిస్తే - ఎప్పుడో ఒకప్పుడు చట్టం ముందు అడ్డంగా దొరికిపోతామని చెప్పారు. ఇప్పుడు చిదంబరం పరిస్థితి కూడా అదేనని చెప్పారు. అప్పుడు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఉల్లంఘించారు కాబట్టే....ఇప్పుడు జైల్లో ఉన్నారని అన్నారు.

   

Tags:    

Similar News