బీజేపీ కంచుకోట‌లో కాంగ్రెస్ భారీ విజ‌యం.. దేనికి సంకేతం?

Update: 2022-12-22 09:37 GMT
ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీదే పైచేయి అనుకున్న మ‌హారాష్ట్ర‌లో అనూహ్యంగా కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. బీజేపీకి కంచుకోట అనుకున్న ఓ మునిసిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేసింది. దీంతో ఈ ప‌రిణామం దేనికి సంకేతం అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు.. ఇక‌, కాంగ్రెస్ అయిపోయింద‌ని.. బీజేపీదే ఫ్యూచ‌ర్ అని ప్ర‌చారం చేస్తున్న నాయ‌కుల‌కు ఈ ప‌రిణామం గ‌ట్టి షాక్ ఇచ్చింది.

ఏం జ‌రిగిందంటే..మ‌హారాష్ట్ర‌లోని కీల‌క‌మైన నాగపూర్ మునిసిపాలిటీ/పంచాయితీలో స్థానిక సంస్థల ఎన్నికలు జ‌రిగాయి. వీటి ఫ‌లితం తాజాగా వ‌చ్చింది. నాగపూర్ లోని 236 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 200 చోట్ల గెలుపొం దింది.

డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సొంత గ్రామం ఫెట్రీలో కూడా కాంగ్రెస్ విజయం సాధించడం విశేషం. నిజానికి ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ.. ఇక్క‌డే ప‌ర్య‌టించి.. అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు.

అయితే, అనూహ్యంగా బీజేపీకి ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డం గ‌మ‌నార్హం.  అదేస‌మ‌యంలో మ‌రో ప్ర‌ధాన పార్టీ శివ‌సేన‌(రెండు వ‌ర్గాలు)కు కూడా ప్ర‌జ‌లు గ‌ట్టిగానే బుద్ధి చెప్పార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.

ఇక‌, కాంగ్రెస్ విజ‌యాన్ని ఏ కోణంలో చూడాల‌నేది చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. రాహుల్ గాంధీ చేప‌ట్టిన జోడో పాదయాత్రతోనే ఇది సాధ్యమయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

కానీ, మేధావులు మాత్రం.. ఇది కాంగ్రెస్‌కు ద‌క్కిన విజ‌య‌మే అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల కొన్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను ప్ర‌జ‌లు ఆహ్వానించ‌లేక ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్‌ను ఎంచుకు న్నార‌ని.. దీనిని నిల‌బెట్టుకునేందుకు.. ఆ పార్టీ మ‌రింత ప్ర‌య‌త్నం చేయాల‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. దీనిని ఊతం చేసుకోవాల‌ని చెబుతున్నారు. ఇక‌, బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News