కారు ఎక్క‌టంపై ముఖేశ్ ఫుల్ క్లారిటీ!

Update: 2018-07-01 10:24 GMT
హైద‌రాబాద్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంటుంద‌ని.. మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ త్వ‌ర‌లోనే గులాబీ కారు ఎక్క‌నున్న‌ట్లుగా వార్త‌లు రావ‌టం తెలిసిందే. అయితే.. ఇందులో వాస్త‌వం లేద‌న్న విష‌యం తాజాగా తేలిపోయింది.

ఈ రోజు ముఖేష్ గౌడ్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించారు. దీంతో.. ఏదో ఒక స‌మ‌యంలో గులాబీ కారు ఎక్కే విష‌యంపై జ‌రుగుతున్న ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ వీడే అవ‌కాశం లేద‌ని చెప్పారు. ఒక‌వేళ పార్టీ మారాల్సి వ‌స్తే.. తన అనుచ‌రులు.. కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడి నిర్ణ‌యం తీసుకుంటాన‌న్నారు.

కాంగ్రెస్ లో బీసీ నేత‌ల్ని కాంగ్రెస్ నాయ‌క‌త్వం అణ‌గ‌దొక్కుతుందంటూ ఈ మ‌ధ్య‌న పార్టీ మారి.. గులాబీ కారు ఎక్కిన మ‌రో మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన వైనం తెలిసిందే.

దానం వ్యాఖ్యాల నేప‌థ్యంలో ముఖేష్ గౌడ్ కూడా పార్టీ మారే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే.. ఇందులో నిజం లేద‌ని.. కొత్త రాష్ట్రం.. కొత్త ప్ర‌భుత్వం కొలువు తీరిన నేప‌థ్యంలో నాలుగేళ్లుగా కాస్తంత స్త‌బ్దుగా ఉన్న‌ట్లు చెప్పారు. కొత్త రాష్ట్రం.. కొత్త ప్ర‌భుత్వంపై అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేయ‌టం స‌రికాద‌న్న ఉద్దేశంతో తాను మాట్లాడ‌లేద‌న్న ముఖేశ్‌..ఇక‌పై తామేంటో చేత‌ల్లో చేసి చూపిస్తామ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. గ్రేట‌ర్ లో కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉంద‌ని.. సిటీ పార్టీ ప్రెసిడెంట్ అంజ‌న్ కుమార్ నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌నున్న‌ట్లు ముఖేష్ గౌడ్ స్పష్టం చేశారు. మ‌రోవైపు.. ముఖేష్ బ‌ర్త్ డే వేడుక‌ల్ని అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు.
Tags:    

Similar News