ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పై కాంగ్రెస్ తీరేంటో మరోసారి స్పష్టమైంది. తాము గెలిచిన చోట్ల మాత్రం ఈవీఎంలు బాగానే ఉన్నట్లు.. ప్రత్యర్థులు గెలిచిన చోట్ల మాత్రమే వాటిని టాంపరింగ్ చేసినట్లు ఆరోపణలు చేస్తూ.. ఆ పార్టీ తన ప్రతిష్టను దిగజార్చుకుంటుంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ పార్టీ తీరును స్పష్టంగానే చెప్పారు. రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు. రిపోర్టర్లకు విజయ సంకేతం చూపుతూ ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆ రెండు నియోజకవర్గాల్లో ఈవీఎం మెషీన్లను టాంపర్ చేయలేదు అని అనడం గమనార్హం.
కాగా, సిద్ధ పంజాబ్ సీఎం అమరీందర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈవీఎంలను టాంపర్ చేసి ఉంటే నేను ఈ కుర్చీలో కూర్చుండేవాడిని కాదు అని అమరీందర్ అన్నారు. ఈవీఎంలపై పోరాటంలో భాగంగా ఇతర పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్.. ఆ లేఖలో నుంచి పంజాబ్ పేరు తొలగించింది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈవీఎంలను వాడకూడదని ఆ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ లేఖను రాష్ట్రపతి - ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ అందజేసింది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు కూడా విచారణ జరిపింది. ఓటు వేయగానే రిసీట్ ఇచ్చే మెషీన్ల కొనుగోలులో ఎందుకు ఆలస్యం జరుగుతున్నదని కోర్టు కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.
ఇదిలాఉండగా... ఇప్పటికే ఓటింగ్ యంత్రాలకు కాంగ్రెస్ సీనియర్ నేత - కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి వీరప్ప మొయిలీ మద్దతు పలికారు. ఈవీఎంల విషయంలో ప్రతిపక్షాల నిరసన నిరాశావాదంతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. ఎన్నికల పరాజయాలకు ప్రాంతీయ పార్టీల తరహాలో కాంగ్రెస్ పార్టీ సాకులు వెతుక్కోవడంపై ఆయన విస్మయం వ్యక్తంచేశారు. ఓటింగ్ యంత్రాల్లో స్థానికంగా పొరపాట్లు జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ.. వాటిని పరిష్కరించుకునేందుకు ఒక వ్యవస్థ ఉంది అని మొయిలీ అన్నారు. `నేను న్యాయశాఖ మాజీ మంత్రిని. నా హయాంలోనే ఈవీఎంలు ప్రవేశపెట్టడం జరిగింది. ఫిర్యాదులు కూడా వచ్చాయి. మేం వాటిని ధ్రువీకరించుకున్నాం. మనం చరిత్రను విస్మరించకూడదు. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఒక వెల్లువ వచ్చినంత మాత్రాన మనం కూడా అందులో పడి కొట్టుకుపోవాలని చూడటం తగదు` అని ఆయన ఒక ఆంగ్ల వార్తా పత్రికకు చెప్పారు. `ఈవీఎంల గురించి మనందరికీ తెలుసు. మా హయాంలో వాటిని పరీక్షించాం కూడా. ఓటమిపాలైనవారే ఈవీఎంలపై నిష్ఠూరాలు వేస్తారు. గెలిస్తే సమస్యే ఉండదు!` అని పరోక్షంగా సొంత పార్టీ తీరునే మొయిలీ తప్పుపట్టారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/