కేటీఆర్ : రాహుల్ అంటే బ‌య్యం ! అవునా !

Update: 2022-05-08 00:29 GMT
కేటీఆర్ స్థాయి మ‌రిచి మాట్లాడ‌డంతో తెలంగాణ వాకిట కొత్త వివాదాలే ర‌గులుతున్నాయి. రాహుల్ కార‌ణంగా తెలంగాణ కాంగ్రెస్ లో అనూహ్య మార్పులు వ‌చ్చినా  రాకున్నా ఓ విధంగా కేటీఆర్ కార‌ణంగా ఫ‌లితాల్లో మాత్రం మార్పులు రావ‌డం ఖాయం.

ముఖ్యంగా ఆయ‌న మ‌మ్మీ, డ‌మ్మీ అంటూ కొన్ని ప‌దాలు వాడి మ‌రీ ! ఎప్ప‌టివో సంగ‌త‌లు తెర‌పైకి తెచ్చారు. రాములా ! రాహుల్ ముత్తాత‌లు గురించి మాట్లాడి సాధించేదేంట‌ని?

తెలంగాణ వాకిట కొత్త రాజ‌కీయం అప్పుడే మొద‌ల‌యిపోయింది. కేటీఆర్ పూర్తిగా గేర్ మార్చి మాట్లాడుతున్నారు. అయితే మ‌రీ ఘోరంగా పీసీసీ చీఫ్ ను గాడ్సేతో పోల్చ‌డం అస్స‌లు బాలేద‌ని విప‌క్షం మండిప‌డుతోంది. ముందు ఎవ‌రేంటో తెలుసుకుని మాట్లాడాల‌ని కోరుతోంది. అధికారం అన్న‌ది ప్ర‌జ‌లు ఇచ్చిన భిక్ష అన్న‌ది మ‌రిచిపోకూడ‌దు అని అయినా టెన్ జ‌న్ ప‌థ్ మాట క‌న్నా జ‌న‌ప‌థంలో ఉన్న మాటకే ఎక్కువ విలువ అన్న సంగ‌తి మాకూ తెలుసు అని కూడా అంటోంది కాంగ్రెస్.  ఏ విధంగా ప‌రిగ‌ణించినా నిన్న‌టి స‌భ టీఆర్ఎస్-కు ముచ్చెమ‌ట‌లు పోయిస్తోంది. స‌భ విజ‌య‌వంతం కావ‌డాన్ని వాళ్లంతా అస్స‌లు త‌ట్టుకోలేక‌పోతున్నార‌న్న‌ది ఓ వాస్త‌వం. గులాబీ శ్రేణులకు చెందిన కొంద‌రు క‌ట్టు త‌ప్పి మాట్లాడ‌డం అస్స‌లు భావ్యంగా లేదు.

రాజ‌కీయంలో ఒక వ‌ర్గం గురించి మ‌రో వ‌ర్గం మాట్లాడుకోవాలి. అది నీతి కావొచ్చు అవినీతి కావొచ్చు లేదంటే చాణ‌క్య రీతి కావొచ్చు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అయితే దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చింది బ్రిటిష‌ర్లు క‌నుక వారు కూడా గ్రేటేనా అని అంటున్నారు ఆయ‌న. ఏం పోలిక తెచ్చారు. బానిస బ‌తుకుల నుంచి బంధ విముక్తం అయ్యేందుకు ఆ రోజు ఎన్ని పోరాటారాలు చేశామ‌ని..అవ‌న్నీ మ‌రిచిపోయి అధికారం ఉంద‌న్న ఒకే ఒక్క ద‌ర్పంతో కేసీఆర్ మాట్లాడ‌డం త‌గ‌ద‌ని విపక్షం అంటోంది. అయినా వ‌రంగ‌ల్ స‌భ విజ‌య‌వంతం కాగానే రాహుల్ మానియా పై అప్పుడే అంత‌గా ఎందుకు విరుచుకుప‌డుతున్నారో త‌మ‌కు అర్థం కావ‌డం లేద‌ని అంటున్నారు వీరంతా ! అంటే త‌మ నాయ‌కుడంటే భ‌య‌మా లేదా అధికారం పోతుంద‌న్న భ‌యమా.. అంటే ఇప్పుడు గాంధీ భ‌వ‌న్ గాడ్స్ కు అప్ప‌గించారా? అలా ఎలా అయింద‌ని ? అంటే నోటికి  ఎంత మాట వ‌స్తే అంత మాట అనేయ్య‌డ‌మేనా అని నిల‌దీస్తున్నారు కాంగ్రెస్ నాయ‌కులు.

మాములుగా కాదు చాలా ఎక్కువ‌గానే ఈ ప‌దం వాడాలి. భ‌యం అని కాకుండా బ‌య్యం అని ! ఈ మాట సౌదా అనే రైట‌ర్ వాడుతారు. ఎందుకంటే రాజ‌కీయంలో అన్ని భ‌యాలే కదా ! మాట్లాడితే భ‌యం.. మాట్లాడ‌కుండా ఉంటే భ‌యం.. విమ‌ర్శ‌లు చేయాలంటే భ‌యం.. విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తి విమ‌ర్శ‌ల‌ను జోడించాల‌న్నా భ‌యమే ! క‌నుక పాపం కేటీఆర్ అప్పుడే భ‌యం అనే లోయ‌లో ప‌డిపోయారా అని విమ‌ర్శ చేస్తోంది కాంగ్రెస్. నిన్న‌టిదాకా పెద్ద‌గా మాట్లాడ‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితి ఒక్క‌సారి రివ‌ర్స్ గేర్ వేసింది. మ‌మ్మీ పార్టీకి డ‌మ్మీ లీడ‌ర్ రాహుల్ అని కేటీఆర్ కౌంట‌ర్లు దాఖ‌లు చేస్తున్నారు ఎందుక‌ని?
Tags:    

Similar News