కాంగ్రెస్ పార్టీలో శశి థరూర్ కే ఆ అవకాశం?

Update: 2019-05-26 05:48 GMT
లోక్ సభలో ఫ్లోర్ లీడర్ ను ఎన్నుకోవాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ఒక లీడర్ కావాలి. ఆల్రెడీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ పదవికి రాజీనామా అంటూ ఆయన హడావుడి చేస్తున్నా అదేం జరిగే పనిలా కనిపించడం లేదు.

ఇక లోక్ సభలో పార్టీ అధ్యక్ష పదవిని కాంగ్రెస్ హై కమాండ్ ఎవరికి అప్పగిస్తుందో చూడాల్సి ఉంది. గత ఎన్నికల తర్వాత లోక్ సభ లో మల్లిఖార్జున ఖర్గే ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. అయితే ఆయన ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తు అయ్యింది. ఈ సారి కూడా సౌత్ లీడర్ కే ఆ పదవిని అప్పగించనుందట కాంగ్రెస్ పార్టీ హై కమాండ్.

అందులో భాగంగా ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిదాయకంగా  మారింది. బహుశా శశి థరూర్ కు ఆ అవకాశం దక్కుతుందనే మాట వినిపిస్తూ ఉంది. కేరళకు చెందని ఈ కాంగ్రెస్ నేత మరోసారి ఎంపీగా నెగ్గారు. తిరువనంతపురం నుంచి ఈయన వరసగా ఎంపీగా నెగ్గుతూ వస్తున్నారు. వరసగా మూడో సారి ఎంపీగా నెగ్గారు.

ఈ నేపథ్యంలో లోక్ సభలో కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడిగా శశికి అవకాశం లభిస్తుందనే వాదన మొదలైంది. శశిథరూర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా సెట్ అవుతాడనే వాదన ఒకటి ఉంది. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలోని వ్యవహారాలు అందుకు అడ్డంకిగా మారే  అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News