వరంగల్ లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ అంటే ఆశ్చర్యంగా ఉంది కదా... కానీ, నిజమే ఓ విషయంలో ఆ పార్టీలో అక్కడ క్లీన్ స్వీప్ చేసింది. వరంగల్ ఉప ఎన్నికల లెక్కింపు జరుగుతోంది.... ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది రౌండ్ల లెక్కింపులో టీఆరెస్ అభ్యర్థి దయాకర్ కు ఇప్పటికే రెండున్నర లక్షలకుపైగా మెజారిటీ వచ్చింది.. కానీ, పోస్టల్ బ్యాలట్లలో మాత్రం దయాకర్ కు ఒక్క ఓటు కూడా రాలేదట. మొత్తం ఓట్లన్నీ కాంగ్రెస్ కే పడ్డాయట. ఇంతకీ ఎన్ని ఓట్లు పోలయ్యాయో కూడా తెలుసా... నాలుగు ఓట్లు. అవును.. మొత్తం నాలుగు పోస్టల్ ఓట్లు పోలవగా ఆ నాలుగూ సర్వే సత్యనారాయణకే వచ్చాయట.
మొత్తం 480 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను కేవలం నాలుగే ఓట్లు పోలయ్యాయి. ఆ నాలుగు కూడా కాంగ్రెస్ కే పడడం గొప్ప విషయం. ఈవీఎంలో ప్రజలు ఓట్లు వేసిన ఓట్లు మాత్రం టీఆరెస్ కు పడుతున్నాయి. సర్వేకు డిపాజిట్లు రావడం కూడా కష్టమని అంటున్నారు. మొత్తం ఆరువందల మంది ఎన్నికల సిబ్బంది ఓట్లను లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం రెండుగంటలకల్లా తుది ఫలితం వెలువడుతుందని భావిస్తున్నారు. టీఆరెస్ అభ్యర్థి దయాకర్ జోరు చూస్తుంటే మొన్నటి ఎన్నికల్లో అక్కడ కడియం శ్రీహరి సాధించిన మెజారిటీ కంటే కూడా అధికంగానే సాధిస్తారని భావిస్తున్నారు. ఇప్పటివరకు మిగతా పార్టీల అభ్యర్థులు ఆయన దరిదాపుల్లో కూడా లేరు. బీజేపీ అభ్యర్థి దేవయ్య కూడా బాగా వెనుకబడి ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యానారాయణకు సుమారు 75 వేల ఓట్లు ఇంతవరకు రాగా, దేవయ్యకు 50 వేల ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీ అభ్యర్థికైతే సుమారు 5 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి.