ప‌ద‌వులు ఇచ్చి ప‌రేషాన్ చేయ‌నున్న ప్ర‌తిప‌క్షం

Update: 2017-10-14 04:47 GMT
తెలంగాణ‌లో ఓ భిన్న‌మైన సీన్ చోటుచేసుకుంది. సాధార‌ణంగా అధికార పార్టీ నేత‌ల‌కు ప‌ద‌వుల పండుగ ఉంటుంది. ఈ ప‌ద‌వుల పందేంరంతో పాల‌క పార్టీ నేత‌ల్లో ఇనుమ‌డించిన ఉత్సాహం వ‌స్తుంది. వాటిని చూసి విప‌క్ష పార్టీ నేత‌లు ఒకింత నారాజ్ అవుతుంటారు. కానీ అధికార పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ చేసి చూపించ‌ని ప‌నిని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పెద్ద‌లు చేశారు. అదే సీనియ‌ర్ నాయ‌కుల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టేందుకు సిద్ధ‌మ‌వ‌డం. ఏఐసీసీలో పెద్ద పోస్టులు  ఇవ్వ‌డం. అయితే ఢిల్లీ నుంచి ఈ గుడ్ న్యూస్‌ తో పాటు మ‌రో భారీ బ్యాడ్ న్యూస్ (!) కూడా వ‌చ్చిందంటున్నారు.

కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీని అధ్య‌క్షుడిగా ఎన్నుకునేందుకు ఈ మాసంలో జాతీయ ప్లీనరీ జరగనుంది. ఈ సందర్భంగా ఎఐసీసీ నూతన అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు తీసుకోబోతుండ‌టం దాదాపుగా ఖ‌రారు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర నుండి కొందరిని త‌న టీంలోకి తీసుకునేందుకు రాహుల్‌ గాంధీ నుండి గ్రీన్‌ సిగ్నల్  లభించిందని స‌మాచారం. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతల్లో కొందరికి జాతీయ పదవులు దక్కబోతున్నాయి. సీడబ్ల్యుసీ మెంబర్‌ గా కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి - ఎఐసీసీి జనరల్‌ సెక్రటరీగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య - అధికార ప్రతినిధిగా దాసోజ్‌ శ్రవణ్‌ ను నియమించబోతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఏఐసీసీ జాతీయ కార్యదర్శులుగా విజయశాంతి - కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ లేదా మాజీ ఎంపీ అజహరుద్దీన్‌ లను తీసుకునే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. టీపీసీసీ టీంకు అదనంగా బీసీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి దక్కనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఏఐసీసీ నుంచి గ్రీన్‌ సిగ్నల్  అందినట్టు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్గాలు తెలిపాయి.

కాగా, ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయశాంతి సేవలను పార్టీకి ఉపయోగించుకోవడానికి ఇప్పటికే ఉత్తమ్‌ కుమార్‌ ఆమెతో సంప్రదింపులు జరిపారని స‌మాచారం. ఏఐసీసీ వర్గాలు కూడా ఆమెతో మాట్లాడినట్టు తెలిసింది. గత ఎన్నికలల్లో టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటి చైర్మెన్‌ గా ఉన్న దామోదర రాజనర్శింహ్మ వచ్చే ఎన్నికలకు ప్రచార సారధిగా నియమించేందుకు అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది.

అయితే ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉన్నా ఇందులోని అంత‌ర్గత‌ ష‌ర‌తే టీ కాంగ్రెస్ నేత‌ల‌కు శ‌రాఘాతంగా మారింద‌ని అంటున్నారు. అదేంటంటే....ఈ పెద్ద నాయ‌కులంతా రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీ కోసం శ్ర‌మించాలట‌. ప‌దువులు తీసుకున్న త‌ర్వాతే రాష్ట్రంలో తాము ఏం చేయ‌బోతున్న‌ది, ఎలా చేయ‌బోతున్న‌ది ఢిల్లీ పెద్ద‌ల‌కు వివ‌రించాల‌ట‌. దీంతో...ఢిల్లీ స్థాయిలో ప‌ద‌వులు ద‌క్కుతున్నాయ‌ని సంబ‌ర ప‌డాలో...గ‌ల్లీలో ఇంకా బాగా శ్ర‌మించాల‌ని బాధ‌ప‌డాలో అర్థం కావ‌డం లేద‌నే చ‌ర్చ కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల్లో జ‌రుగుతోంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News