ఇటీవలి కాలంలో అటు మీడియాలో - ఇటు జన బాహుళ్యంలో చర్చనీయాశంగా మారిన అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ప్రజల్లో గతంలో ఉన్న భావన మారిపోయింది అని. ఆయన పట్ల తటస్థుల్లో ఆదరణ తగ్గిపోతోందని ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీన్ని నిజం చేస్తూ తాజాగా ఓ సర్వే తమ ఫలితాలను వెల్లడించింది. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్ డీఎస్) సంస్థ తను చేసిన సర్వేలో నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రజానీకంలో ఆదరణ పెద్దఎత్తున తగ్గుతోందని పేర్కొంది. ఈ సంస్థకు చెందిన లోక్ నీతి రిసెర్చ్ ప్రోగ్రామ్ కు చెందిన కొందరు పరిశోధకులు ఒక మీడియా సంస్థ సహకారంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిణామం సహజంగానే బీజేపీ నేతలకు రుచించడం లేదు.
సీఎస్ డీఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం 2014లో యూపీఏ -2 ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత కన్నా ప్రస్తుతం నరేంద్రమోడీ సర్కారుపై ప్రజల అసంతృప్తి ఎక్కువగా ఉంది. నోట్ల రద్దు - జీస్టీ తదితర అంశాలతో పాటు - ప్రజానీకం పెద్ద ఎత్తున ఇక్కట్ల పాలవుతుండటం కూడా నరేంద్ర మోడీ సర్కారుకు ప్రజల్లో ఆదరణ గణనీయంగా తగ్గడానికి కారణాలుగా ఈ సర్వే నిర్ధారించింది.ప్రజానీకపు సంతృప్తి స్థాయిని కొలవడానికి వారు ఎదుర్కుంటున్న సమస్యలనే కొలబద్దగా ఈ సర్వేలో వినియోగించారు.
మింట్ మిజరీ ఇండెక్స్ గా వ్యవహరించే ఈ విధానంలో ద్రవ్యోల్భణం - నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల - నిరుద్యోగం ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రజల అభిప్రాయాలను సేకరిస్తారు. దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)ని లెక్కగట్టే విధానం మారడంతో కొన్ని నూతన అంశాలను కూడా సర్వేలోకి తీసుకున్నారు. ఉద్యోగ కల్సనకు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు - వాస్తవ పరిస్థితికి పొంతన లేకపోవడం - ఆధారపడ్డదగ్గ విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ఉపాధి అవకాశాల స్థాయి - ప్రజల కొనుగోలు శక్తి - ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్న మొత్తాన్ని పరిగణలోకి తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర ఖర్చులకు ప్రజలు వినియోగిస్తున్న మొత్తాన్ని కొలబద్దగా తీసుకున్నారు. 0 నుండి 100 వరకూ వుండే ఈ సూచీలో 100 అన్నది ప్రజల ఇక్కట్ల గరిష్ట స్థాయిని సూచిస్తుంది.
యుపిఎ -2 ప్రభుత్వంపై 2014లో 57 పాయింట్ల వద్ద ప్రజల అసంతృప్తి స్థాయి ఉండగా - తాజా సర్వేలో అది 64 పాయింట్లకు చేరుకుంది. ' రానున్న రోజులో ఈ సమస్యలను కొంతవరకైనా పరిష్కరించకపోతే మోడీ సర్కారు ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవటం ఖాయంగా కనిపిస్తోంది' అని సీఎస్ డీఎస్ వ్యాఖ్యానించింది. నరేంద్రమోడీ ప్రభుత్వ హయంలో ప్రజానీకం పెద్ద ఎత్తున సమస్యల వలయంలో చిక్కుకుపోయిందని - ఏటికేడాది ఈ సమస్యలు పెరుగుతున్నాయని ఈ సర్వే నిర్ధారించింది. నోట్ల రద్దు తరువాత ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దీనికి తోడు పెరుగుతన్న నిరుద్యోగం, నిత్యావసర వస్తులు ధరలు, జీవన ప్రమాణాలు గణనీయంగా పడిపోవడం వంటివి కూడా ప్రజల్లో అసంతృప్తికి దారి తీసిందని తెలిపారు. 2017 ప్రధమార్ధంతో పోలిస్తే ద్వితీయార్థంలో ప్రజల కష్టాలు మరింత పెరిగాయని సర్వే పేర్కొనడమే దీనికి నిదర్శనం.
కాగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసంవత్సరాల్లో పెద్దగా కనిపించని అసంతృప్తి 2016 నుండి పెరగడం కనిపించింది. 2017 ఆర్ధిక సంవత్సరం తరువాత ఈ ప్రక్రియ మరింత వేగవంతమై 64 పాయింట్లకు చేరింది. ముఖ్యంగా గత ఏడాది వేసవి తరువాత మోడీ సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో పెరిగిన విషయాన్ని ఈ సర్వే స్పష్టం చేసింది. మంచి రోజులు తెస్తామన్న హామీ నెరవేర్చటంలో మోడీ విఫలమయ్యారన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోందని ఈ సర్వే మరోమారు స్పష్టం చేసిందని అంటున్నారు.