ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఏకంగా తమ పార్టీ ఆగర్భ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తోనే జత కట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏపీలో రాజీకాయాలు మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ తో కలవడానికి టీడీపీ నేతలు ఇప్పటికే మానసికంగా సిద్ధమైపోయినా చాలామంది కాంగ్రెస్ నేతలు మాత్రం టీడీపీతో కలవడానికి ససేమిరా ఇష్టపడడం లేదట. దాంతో కాంగ్రెస్ సీనియర్లు - కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ ఖాళీగా ఉన్న నేతలు ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి మానుకోట మహిధర్ రెడ్డి తాను వైఎస్సార్సీపీలోకి చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు మాజీ మంత్రి ఆనం కూడా టీడీపీలో చేరినా అక్కడ ఇమడలేక వైసీపీలోకి వెళ్తున్నట్లు సమాచారం. మరోవైపు రాయలసీమకు చెందిన ఓ మాజీ మంత్రి కూడా వైసీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఓవైపు తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల్లోంచి నేతలను ఆహ్వానిస్తున్నా మాజీల కన్ను మాత్రం వైసీపీపైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీలు కూడా ఇప్పుడు వైసీపీ వైపు వెళుతున్నారు. కాంగ్రెస్ లో మిగిలిపోయిన వారు కూడా ఇప్పుడు వైసీపీ బాట పడుతున్నారు. సుదీర్ఘ అనుభవంతో తాజా పొలిటికల్ ట్రెండ్ అర్థం చేసుకుంటూ వైసీపీ పట్ల ఆకర్షితులవుతున్నారని... దాంతోపాటు ఏమాత్రం కష్టానికి వెరవకుండా పట్టుదలతో జగన్ పాదయాత్ర చేస్తుండడం చూసి కూడా ఆయన సామర్థ్యంపై నమ్మకం పెంచుకుని ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.