నాయకత్వ బాధ్యతల విషయంలో...ఊహించని రీతిలో వార్తల్లో నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు తమ కొత్త సారథి కోసం ఊహించని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో...పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీ సీనియర్లు ‘‘అమ్మా.. మీరే దిక్కు. పార్టీకి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టండి’’ అని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ (72)ని ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. దీనిపై సోనియా నిర్ణయం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. విచిత్రం ఏంటంటే.. రాజీవ్ గాంధీ మరణం తర్వాత కొంతకాలం ఇతరుల చేతిలో పార్టీ నడిచినా ఆ తర్వాత కాంగ్రెస్ బాధ్యతలను అపుడు కూడా సోనియా బలవంతం మీదే చేపట్టారు. తాజాగా మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది.
లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ బాటలోనే పలు రాష్ర్టాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. రాహుల్ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఆందోళనలు - ఆత్మహత్యాయత్నాలు కూడా చేసినా ఆయన స్పందించడం లేదు. ప్రత్యామ్నాయ అధ్యక్షుడి కోసం కాంగ్రె స్ సీనియర్ నేతలు తీవ్ర చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. పలు రాష్ర్టాల్లో పార్టీ భవిష్యత్తుపై కేడర్ లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో సోనియానే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ విధేయులు కోరుతున్నారు. ఆమె విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలకు ఆరోగ్యం సహకరించడం లేదని తన సన్నిహితులకు ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు సీనియర్ నేతలే పార్టీలోని పరిణామాలపై ఘాటుగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కరణ్ సింగ్ మాట్లాడుతూ - ఇప్పటికైనా ఎటువంటి జాప్యానికి తావు లేకుండా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలో సమావేశమై తప్పనిసరి నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని కోరారు. మే 25న రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక గందరగోళంతో కాంగ్రెస్ శ్రేణులు దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకోవడం ఆశ్చర్యం కలిగించింది. రాహుల్ సాహసోపేత నిర్ణయాన్ని గౌరవించడానికి బదులు ఆయన రాజీనామాను వెనుకకు తీసుకోవాలని కోరుతూ నెల సమయం వృథా చేశారు అని మండిపడ్డారు.