పరిశ్రమలో ఎవరు దేనికి భయపడకపోయినా కంగన నోటి దురుసుకు దూకుడుకు కచ్ఛితంగా భయపడుతున్నారు. రోషన్ లు.. కపూర్ లు.. కరణ్ లకే చెమటలు పట్టించిన ఘనత కంగనకే సాధ్యమైంది. నటవారసుల కంటికి కునుకుపట్టనివ్వని నైజం కంగన సొంతం. ఇక ఇటీవల మహారాష్ట్రలో శివసేనకు నిదురే కరువైందంటే దానికి కారణం ది గ్రేట్ క్వీన్ కంగన.
ఇలాంటి సన్నివేశంలో కంగనను కెలికేంత ధైర్యం తెలిసి ఎవరూ చేయరు. కానీ ఆ కాంగ్రెస్ సీనియర్ నేత అనవసరంగా కెలకడం తాజాగా బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆయనేమన్నారు? అంటే..
ఈ కంగనా ఎవరు? అంటూ పబ్లిక్ లో మీడియా మీట్లో ప్రశ్నించారు. అయితే ఆయన అలా ప్రశ్నించడానికి కారణమేమిటి? అంటే.. చాలా కథే ఉంది. ఓ పార్టీ సమావేశంలో అసలు ఐటెమ్ నంబర్లు చేయని కథానాయిక కంగన అంటూ పొగిడేశాడో పార్టీ నాయకుడు. కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక పార్టీ ఎమ్మెల్యే అలా అనడం గిట్టలేదు.
దిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ట్వీట్లను వేస్తూ అవమానించిందని ఆరోపిస్తూ బేతుల్ జిల్లాలో సినిమా షూటింగ్ లో ఉన్న కంగన రనౌత్ పై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం బేతుల్ లో విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుఖ్ దేవ్ రైతులను అవమానించిన `నాచనే-గానే వాలి`(డ్యాన్సర్ కం సింగర్) పై నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీతో జులుం చూపించారని ఆరోపించారు. అయితే అతడిపై ట్విట్టర్ లో స్పందించిన కంగన అతడి నివేదికను ట్యాగ్ చేస్తూ `ఈ మూర్ఖుడు` అంటూ తిట్టేసింది.
ఈ వివాదం పరిణామ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ ని కంగన దూకుడు గురించి మీడియా ప్రశ్నించగా.. `ఈ కంగనా ఎవరు?` అంటూ షాకిచ్చారాయన. అసలు ఆ నటి ఎవరో కూడా తెలీదు! అన్నట్టే మాట్లాడారు.
ఇంతకుముందు భాజపా నాయకుడు.. రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా మాట్లాడుతూ.. బెహన్-బేటి కంగనాకు షూటింగ్ సమయంలో ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని అనడం కాంగ్రెస్ వర్గీయుల్లో కాకలు పుట్టించింది. టోటల్ సీక్వెన్సుల్లో దిగ్విజయ్ ప్రశ్న షాకిచ్చేదే. అనవసరంగా పెద్దాయన కంగనతో పెట్టుకున్నాడే! ఇక బడితె పూజ ఖాయమే! అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ కు తావిచ్చింది.