ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులు రేవంత్ పాదయాత్ర.. అధికారం సాధ్యమవుతుందా?
వరుసగా పదేళ్ల పాలన వైపు వెళ్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు వెళ్తుంది. కానీ జాతీయ పార్టీలు మాత్రం తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో బీజేపీ దక్షిణాదిలో పాగా వేయాలనుకున్న తరుణంలో తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇక్కడ అధికారంలోకి రావాలని రకరకాల వ్యూహాలు రచిస్తోంది. మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలను ఆకర్షిస్తోంది. ఇక తాజాగా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ సైతం తెలంగాణను కీలకంగా మార్చుకుంది. ఇక్కడ పాగా వేయాలని ఏఐసీసీ నాయకులు సైతం రాష్ట్ర నాయకులు చేపట్టబోయే కార్యక్రమాలకు ఫుల్ సపోర్టు ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించే పాదయాత్రకు నేరుగా సోనియాగాంధీనే మద్దతు ఇస్తున్నారు. ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమయ్యే ‘హాథ్ సే హాథ్ జోడోయాత్రకు’ ఆమె హాజరు కానున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వస్తామని టీపీసీసీ నాయకులు ధీమాతో ఉన్నారు.
తెలంగాణ లో ఫిబ్రవరి 6 నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టబోతున్నారు. దీనికి ‘హథ్ సే హాథ్ జోడోయాత్ర’ అని పేరు పెట్టనున్నారు. అంతేకాకుండా ఈ యాత్రలో సోనియాగాంధీ లేదా ప్రియాంక గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. భద్రాచలం, మహబూబ్ నగర్ లేదా ఆదిలాబాద్ జిల్లాలో ఈ పాదయాత్ర ఫిబ్రవరి 6న ప్రారంభించే అవకాశం ఉందని అన్నారు. మొత్తం 60 రోజుల పాటు నిర్వహించే ఈ యాత్రకు అందరూ కలిసి రావలని రేవంత్ రెడ్డి కోరారు. అలాగే ఈ యాత్రకు ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో యాత్ర సాగనుంది.
2014 నుంచి తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి అంతా బాగోలేదు. ప్రజల్లో ఎంతో కొంత ఆ పార్టీపై అభిమానం ఉన్నా పార్టీ నాయకుల్లో విభేదాలతో దానిపై నమ్మకం పోతుంది. ఇటీవల అసమ్మతి రచ్చకెక్కడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. మరోవైపు తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. తెలంగాణలో చేసిన అభివృద్ధి దేశమంతా చేస్తానని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ పై కొంత అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనిని అవకాశంగా తీసుకొని ప్రజలను తమ వైపునకు తిప్పుకుంటే అధికారం సాధ్యం కావడం పెద్ద విషయం కాదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి నిర్వహించే పాదయాత్రపై తీవ్ర చర్చ సాగుతోంది. ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన జోడో యాత్రకు అనుబంధంగా దీనిని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకం పెరుగుతుందని అంటున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్, బీజేపీలు చేసే మోసాలను ప్రజలకు వివరిస్తామని అంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్యేటఫ్ ఫైట్ సాగుతోంది. అయితే ‘హథ్ సే హాథ్ జోడోయాత్ర’తో బీఆర్ఎస్, బీజేపీపై అసంతృప్తిగా ఉన్నవాళ్లు కాంగ్రెస్ ను ఆదరిస్తారని అంటున్నారు. అయితే పార్టీలో అసంతృప్తులు ఉన్నంతకాలం మనుగడ సాధ్యమని కొందరు అంటున్నారు. ఇప్పటికైనా పార్టీలో వర్గ విభేదాలు తుడిచిపెట్టకుపోతే ప్రజలు ఆదరించడానికి రెడీగా ఉన్నారని పార్టీ నాయకులు అంటున్నారు.