అవసరమో.. మరో మార్గం లేకపోవటమో.. ఇలా కారణాలు ఏమైనా వ్యభిచారం చేసే మహిళలు తీవ్ర ఇబ్బందులు గురి అవుతుంటారు. తమను తాము పోషించేందుకు కొందరు ఈ పని చేస్తుండటం ఒక ఎత్తు అయితే.. చట్టవిరుద్ధంగా ఇలాంటి పనులు చేయటంపై పోలీసులు కన్నెర్ర చేయటం తెలిసిందే. తమను తాము బతికించుకోవటం కోసం.. తమ వాళ్ల బతుకు కోసం కొందరు వ్యభిచారాన్ని వృత్తిగా చేపడుతుంటారు. అయితే.. ఇలాంటి వారిపై పోలీసుల వేధింపులు ఒక రేంజ్ లో ఉంటాయి.
ఇలాంటి వాటి విషయంలో పోలీసుల అనవసర జోక్యానికి చెక్ పెట్టేందుకు వీలుగా.. సెక్స్ వర్కర్ల విషయంపై సుప్రీంకోర్టు నియమించిన ఒక ప్యానల్ కొన్ని సిఫార్సులు చేయనున్నట్లు చెబుతున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది.. సెక్స్ వర్కర్లు తమ సమ్మతితో శృంగారంలో పాల్గొంటే పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకోరాదన్నది ఒక కీలకాంశం. 2011లో ఏర్పాటు చేసిన ఈ ప్యానల్ ఏప్రిల్ లో తన నివేదికను ఇవ్వనుంది. సెక్స్ వర్కర్లు చేసేది ఒకరకంగా చట్టబద్ధమే అయినప్పటికీ పోలీసుల వేధింపులకు.. చర్యలకు వారు బలి అవుతున్నారన్న అభిప్రాయాన్ని సదరు ప్యానల్ అభిప్రాయపడటం గమనార్హం.
వేశ్యాగృహాల మీద పోలీసులు దాడి చేసినప్పుడు.. సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయటం కానీ.. జరిమానా విధించటం కానీ.. వేధించటం కానీ చేయకూడదని ప్యానల్ సిఫార్సులు చేయాలన్న ఆలోచలో ఉన్నట్లుగా చెబుతున్నారు. స్వచ్చంద సెక్స్ వర్క్ అక్రమం కాదని.. బ్రోతల్ హౌస్ నిర్వహించటం చట్టవ్యతిరేకమని ప్యానెల్ పేర్కొనటం గమనార్హం. మరి.. ఈ ప్యానల్ సిఫార్సులపై సుప్రీంకోర్టు ఏ తీరులో రియాక్ట్ అవుతుందో..?