దేశంలో మళ్లీ కరోనా జోరు.. భారీగా పెరిగిన రికవరీ రేటు!

Update: 2020-11-22 07:51 GMT
ఇండియాలో కరోనా మహమ్మారి జోరు మళ్లీ మొదలైంది. దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుతుంది అనుకుంటున్న సమయంలో , మళ్లీ కరోనా పంజా విసురుతుంది. క్రమ క్రమంగా ఇండియా లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన తాజా బులెటిన్ ప్రకారం ఇండియాలో కొత్తగా 45,209 కరోనా కేసులు నమోదయ్యాయి.  తాజా కేసులతో కలిపి ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,95,807కి చేరింది.  ఇందులో 85,21,617 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,40,962 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  

ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 501 మరణాలు సంభవించాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,33,227కి చేరింది. ఇండియాలో రికవరీ రేటు 93.7 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో 4,40,962 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశంలో 10,75,326 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 13,17,33,134కి చేరింది.ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్న దేశాలలో ఇండియా 7వ స్థానంలో ఉండటం షాకింగ్ అంశం. ఇండియా కంటే ముందు అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, బ్రెజిల్, రష్యా ఉన్నాయి.

ఇండియాలో ప్రతి 10 లక్షల మందిలో 95వేల మందికి పైగా కరోనా టెస్టులు జరిగాయి. ఢిల్లీలో కొత్తగా 5.88 వేల కేసులు, కేరళలో కొత్తగా 5.77 వేల కేసులు వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 5వేలకు పైగా నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్, రష్యా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా తర్వాత ఇండియా, ఇటలీ, బ్రెజిల్, రష్యా ఉన్నాయి. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్, ఇండియా, మెక్సికో, బ్రిటన్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Tags:    

Similar News