తగ్గిపోయిందని.. తీవ్రత పెద్దగా లేదు.. మాస్కులు పెట్టుకోకున్నా ఫర్లేదు.. లాంటి భరోసాలు.. మితిమీరిన ఆత్మవిశ్వాసం అగ్రరాజ్యం అమెరికాను దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి.. తాజాగా ప్రపంచ పెద్దన్నకు వణుకు పుట్టేలా చేస్తోంది. మొన్నటివరకు కరోనా తీవ్రత లేదన్న స్థానే.. ఇప్పుడు వణుకుపుట్టేలా కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేసిన నేపథ్యంలో.. అమెరికాలో కరోనా తీవ్రత అంత ఎక్కువగా ఉండదన్న మాట పలువురి నోట వినిపించింది. అందుకు భిన్నంగా డెల్టా వేరియంట్ తో పాటు కొత్త రకాలు వెలుగు చూస్తున్న వేళ.. వైరస్ తీవ్రత మరోసారి ఎక్కువైంది.
మొన్నటివరకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంటే.. తాజాగా కరోనా మరణాలు ఎక్కువ అవుతున్న వైనం షాకింగ్ గా మారింది. దీనికి కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా వినిపిస్తున్న లెక్కల ప్రకారం రోజువారీ మరణాలు సరాసరిన 750కు పైనే ఉంటాయని చెబుతున్నారు. మంగళవారం ఒక్కరోజులోనే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 1017కు పెరగటం గమనార్హం.
తాజా మరణాలతో కలిపి అమెరికాలో కరోనా మరణాలు మొత్తం 6.22లక్షలకు చేరింది. తాజా లెక్కల ప్రకారం చూస్తే.. రోజులోని ప్రతి గంటకు 42 మంది వరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్యన కరోనా కేసులు మరోసారి ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆసుపత్రుల్లో ఆడ్మిషన్ల తీవ్రత కూడా ఎక్కువైందన్న మాట వినిపిస్తోంది.
కేసుల తీవ్రత మొదలైన కొద్దిరోజులకే వైరస్ లోడ్ అధికంగా ఉన్న కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. గడిచిన రెండు వారాల్లోనే ఆసుపత్రుల్లో చేరికలు 70 శాతం పెరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువ కావటానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగి.. ప్రమాదకర పరిస్థితులు కూడా తలెత్తవచ్చన్న హెచ్చరికను చేస్తోంది నేషనరల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్.
కరోనా వైరస్ తీవ్రత పూర్తిగా తగ్గిపోయిందన్న ధీమాతో అమెరికన్ ప్రజలు పెద్ద ఎత్తున ముఖానికి మాస్కు పెట్టుకునే అలవాటును తీసేశారు. భౌతిక దూరం లాంటివి పట్టకుండా పోయి చాలా కాలమే అయ్యింది. వైరస్ ఒక్కసారిగా విరుచుకుపడటం.. అప్పటికే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబితే.. పెద్దగా పట్టించుకోవటం లాంటివి కేసులు పెరగటానికి కారణమవుతున్నాయి.
కొవిడ్ పై పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరించటం కూడా కేసుల సంఖ్య పెరగటానికి కారణంగా చెబుతున్నారు. ఇప్పటికి టీకాలు వేయించుకోని వారికి ముప్పు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. అమెరికాను మహమ్మారి మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పాలి.