కరోనా వైరస్ .. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చాలా ఎక్కవగా ఉంది. ఈ కారణంగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. భారతదేశంలో కరోనా నివారణకు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ దీనిని పూర్తిగా నివారించలేకపోతున్నారు. కరోనా వైరస్ పై అవగాహనా కల్పించడానికి తమిళ నాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇప్పుడు తెలంగాణలో కరోనా పై మరో రకంగా అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించడం కోసం బహదూర్ పురలోని సుధా కార్స్ మ్యూజియంకు చెందిన కన్యాబొయినా సుధాకర్ ఒక కరోనా కారు రూపొందించారు. ఈ కారు కరోనా వైరస్ ఆకారాన్ని పోలి ఉంది. ఇది ప్రజలకు సామాజిక దూరం గురించి అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాడు. ఈ కరోనా కారుని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ కరోనా కారును 100 సిసి ఇంజిన్ తో రూపొందించారు. ఇందులో ఒకే ఒక సీటు మాత్రమే ఉంటుంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
ఇకపోతే , ఈ కరోనా కారు ని తయారు చేసిన సుధాకర్ ఇప్పటివరకు రకరకాలైన కార్లని తయారుచేసి, సుధా కార్స్ మ్యూజియంలో ప్రదర్శించారు. ఈ కార్లలో హ్యాండ్ బ్యాగ్ కార్, షూ కార్, హెల్మెట్ కార్, కెమెరా కార్, టాయిలెట్ కార్, కండోమ్ కార్, బర్గర్ కార్ మరియు అనేక ఇతర మోడళ్లు ఉన్నాయి. అతను అనేక సైకిళ్లతో పాటు ప్రపంచంలోని అతి చిన్న డబుల్ డెక్కర్‌ను కూడా రూపొందించాడు. ప్రస్తుతం కరోనా మరింత వేగంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో, ఇంటి వద్దే ఉండి సురక్షితంగా ఉండమని ప్రజలకు చెప్పడం చాలా ముఖ్యం మరియు కరోనావైరస్ కారుతో ఒక సందేశాన్ని అందించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని కూడా ఆయన చెప్పారు.