ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రయాణాలు తగ్గిపోయాయి. జనాలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదు. ఉద్యోగాలకు సెలవులిచ్చారు. వర్క్ ఫ్రం హోం అంటున్నారు. చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఉద్యోగులను పెద్ద ఎత్తున తీసేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది మందగమనం కారణంగా ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడం.. జీతాలు పంచడం కంపెనీలకు పెను భారంగా మారింది.
కరోనా వైరస్ కారణంగా ఇండిగో విమానయాన సంస్థ కుదేలైంది. ప్రయాణికులు లేకపోవడంతో నష్టాల బాట పట్టింది. దీంతో ఉద్యోగులకు వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ఇండిగో సీఈవో వెల్లడించారు. తమ సీనియర్ ఉద్యోగులకు 5శాతం నుంచి 25 శాతం వరకు వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ఇండిగో సీఈవో వెల్లడించారు.
ఇక అందరికంటే అధికంగా వేతనంలో 25శాతం తన జీతంలోనే ఉంటుందని ఇండిగో సీఈవో వెల్లడించారు. కరోనా కారణంగా ఇండిగో సంస్థకు ప్రయాణికులు లేక విమానయానం ఇబ్బందుల్లో ఉందని.. ఆదాయం క్షీణించిందన్నారు.
సంస్థ మనుగడ సాగించాలంటే ఏ, బీ బ్యాండ్ ఉద్యోగులు మినహా మిగతా అందరికీ 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ఉద్యోగులకు ఇండిగో సీఈవో మెయిల్ పంపించారు. వేతనాలు కోత విధిస్తే కుటుంబాలకు ఇబ్బంది అయినా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాలంటే సంస్థ మనుగడ సాగించాలని ఈ త్యాగాలు తప్పవని సీఈవో లేఖలో పేర్కొన్నారు.