దేశంలో ముఖ్యంగా తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది. రోజురోజుకు వ్యాధి లక్షణాలు ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా పాజిటివ్ సంఖ్య పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం నివారణ చర్యలు ముమ్మరం చేసింది. అయితే హైదరాబాద్ లో ఉన్న ఐటీ పరిశ్రమలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ఉన్న ఐటీ కంపెనీలు కరోనా నేపథ్యంలో అప్రమత్తమయ్యాయి. కరోనా వైరస్ ఒకరికి వ్యాప్తి చెందిందని వార్తలు రావడంతో ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా డీఎస్ఎం కంపెనీ ఉద్యోగులకు హెచ్ఆర్ మెయిల్ పంపించింది.
మాదాపూర్ పరిధిలోని రహేజ మైండ్ స్పేస్ క్యాంపస్ లోని బిల్డింగ్ నంబర్ 20లోని 9వ అంతస్తు మొత్తం ఖాళీ అయ్యింది. డీఎస్ఎం అనే కంపెనీలోని మహిళా ఉద్యోగినికి కరోనా పాజిటివ్ తేలడంతో కంపెనీ తన కార్యాలయాన్ని మొత్తం ఖాళీ చేయించింది. దీంతో ఇప్పుడు ఆ భవనంలో ఉన్న కంపెనీలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ సందర్భంగా డీఎస్ఎం కంపెనీ ఉద్యోగులకు పంపిన మెయిల్ ఇప్పుడు వైరలైంది. కరోనా వైరస్ బాధితురాలు కోలుకోవాలని కోరుతూ దాని నివారణకు మనం చర్యలు తీసుకుందామని సూచించింది. శుభ్రత పాటిస్తూనే ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉద్యోగులకు మెయిల్ పంపింది. అందరి క్షేమం కోరి ఇళ్ల నుంచే పనులు చేయాలని ఆదేశాలు పంపింది. మళ్లీ తాము సమాచారం ఇచ్చేలోపు ఇళ్ల నుంచే పని చేయాలని స్పష్టం చేసింది.
ఈ వార్త ఐటీ రంగంలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఉద్యోగ రీత్యా ఆ ఉద్యోగులు తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. విదేశాలకు తరచూ వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో తమ కంపెనీలోని ఉద్యోగులు కూడా వెళ్లి వచ్చి ఉంటే వారిని ప్రత్యేకంగా మాట్లాడి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. పర్యటనలు చేసిన ఉద్యోగులు తమకు వైరస్ వ్యాప్తి ఇచ్చిందేమోనని ఆందోళన చెందుతున్నారు.