త్వరలోనే పెళ్లి అంతలోనే విషాదం నింపిన కరోనా

Update: 2021-05-04 00:30 GMT
దేశంలో సెకండ్ వేవ్ కరోనా జోరు కొనసాగుతుంది. మొదటి వేవ్ కంటే  సెకెండ్ వేవ్ లో కరోనా మరింతంగా  వేగంగా దూసుకొస్తుంది. . ఒక్కరిని బలితీసుకోడానికి పరిమితం అవ్వడం లేదు. మరొకరి ప్రాణాన్ని కూడా తోడుగా తీసేస్తోంది. అయితే త్వరలోనే వివాహ వేడుకలకు సిద్ధమవుతున్న ఇళ్లపైనా కరోనా పంజా విసురుతుతోంది. తాజాగా  హైదరాబాద్ లో ఓ ఘోర సంఘటన చోటుచేసుకుంది. మరో 10 రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన అమ్మాయి, అర్థాంతరంగా కన్నుమూసింది. ఆ అమ్మాయి నిండు జీవితాన్ని కరోనా కబలించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ లో నివాసం ఉంటున్న ఓ యువతికి పెళ్లి ఫిక్స్ అయింది.  

కరోనా ఉధృతి ప్రారంభం కాకముందే వివాహం కుదిరింది. కరోనా వల్ల పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. ఇక , ఇలా కాదు అనుకోని  ఈనెల 13న పెళ్లి చేయాలని ముహూర్తం నిర్ణయించారు.దీనితో ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభించారు. ఈ సమయంలోనే   గత నెల 21న యువతికి కరోనా సోకింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. దాదాపు 10 రోజుల పాటు చికిత్స పొందుతూ, కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది ఆ యువతి. మరో 10 రోజుల్లో పెళ్లి ఉందనగా, ఇలా కరోనా కాటుకి బలైంది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని జరుగుతున్నాయి. పెళ్లిబాజా మోగాల్సిన ఆ ఇంట్లో చావుమేళం ఇప్పుడు విషాదం పెను విషాదం నింపింది. వివాహాలపై కరోనా పగ బట్టినట్టు ఉంది. గతేడాదిన భారీగా ముహూర్తాలు ఉన్నా.. కరోనా భయంతో అంతా ఆ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. తరువాత మూఢం కారణంగా ముహూర్తాలు లేకుండా పోయాయి. మే ఫస్ట్ నుంచి మళ్లీ ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి అనుకన్న సమయంలో మళ్లీ కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ కేసులు సంఖ్య పెరుగుతోంది. మరోవైపు ఇప్పటికే కొన్ని ఆంక్షలు ఉన్నాయి. దీంతో పరిమితంగా పెళ్లిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితి కానీ  కరోనా దెబ్బకి మళ్లీ అన్ని వాయిదా వేస్తున్నారు.
Tags:    

Similar News