బ్రేకింగ్ న్యూస్ : ఏపీలో నలుగురు డాక్టర్లకి కరోనా !

Update: 2020-04-08 13:40 GMT
ఏపీలో కరోనా క్రమక్రమంగా పెరిగిపోతుంది. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువౌతున్నాయి. మంగళవారం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినా - బుధవారం మళ్లీ ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగాయి. ఇకపోతే , తాజాగా అనంతపురంలో ఇవాళ ఒక్కరోజే 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ గంధం చంద్రుడు అధికారికంగా ప్రకటించారు. ఈ కేసులతో అనంతపురం జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13కి చేరుకున్నాయి. మక్కా నుంచి వచ్చిన ఇద్దరు - కల్యాణ దుర్గం నుంచి ఢిల్లీ వెళ్లిన మరో వ్యక్తి కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా… ఇటీవల కరోన పాజిటివ్ తో మృతి చెందిన వ్యక్తికి ట్రీట్ మెంట్ ఇచ్చిన నలుగురు డాక్టర్లకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.

ఇకపోతే, ఈ కరోనా వైరస్ కి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో, ప్రపంచం మొత్తం లాక్ డౌన్ ను విధించింది. ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ లాక్ డౌన్ అమలులో ఉంది. సామజిక దూరం పాటిస్తే .. కరోనాను అరికట్టవచ్చు అనే కారణంతో కేవలం నిత్యావసర సరుకులు తీసుకోవడానికి మాత్రమే అనుమతించారు. మిలిగినవి అన్ని కూడా మూసేసారు. కానీ , ఇంకా కొంతమంది ఆకతాయిలు పని లేకున్నా కూడా బయట తిరుగుతున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 14.4 లక్షల మందికి కరోనా పాజిటివ్ రాగా ...83,401 మంది కరోనా కారణంగా మృతిచెందారు.



Tags:    

Similar News