కరోనా మహమ్మారి రెండో దశ తీవ్రంగా వ్యాపిస్తోంది. వైరస్ మ్యూటేట్ అవుతూ ఏడాది కాలంగా విశ్వరూపం చూపిస్తోంది. అయితే తొలిదశలో కొవిడ్ లక్షణాలకు, ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. తొలినాళ్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు ఉండేవి. అయితే మ్యూటేషన్ల వల్ల కొన్ని కొత్త లక్షణాలు బయటకు వస్తున్నాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే అంటున్నారు నిపుణులు.
ఒక్కసారిగా కళ్లు ఎర్రబడుతున్నాయా? ఏదో కళ్ల కలక అని వదిలేస్తున్నారా? అలా చేయవద్దు అంటున్నారు వైద్యులు. కళ్లు గులాబీ రంగులోకి మారడం కరోనా లక్షణమే అంటున్నారు. కళ్ల వాపు, కళ్ల కలక, అదే పనిగా కళ్లలో నుంచి నీరు కారడం వంటివి కొవిడ్ కొత్త లక్షణాలని చైనాలో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. చైనాలో ప్రతి 12 మందిలో ఒకరికి ఈ లక్షణం కనిపిస్తోందని ఆ దేశ వైద్యులు చెబుతున్నారు.
ఎప్పుడూ బాగా పనిచేసే మీ చెవులు ఒక్కసారిగా వినికిడిలో తేడా ఉంటే అలసత్వం వద్దు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెవిలో రింగింగ్ శబ్దం వినిపించినా, ఇతర వినికిడి సమస్యలు తలెత్తినా కరోనా లక్షణమేనని ఇంటర్నేషినల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీ వెల్లడించింది. ఈ సమస్య 7.6 శాతం మందికి ఉంటోందని తెలిపింది.
జీర్ణాశయ సంబంధ వ్యాధులు కరోనాకు కారణం కావొచ్చు. ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు, డయేరియా, కడుపు నొప్పి, వికారం, కొవిడ్ లక్షణాలేనని నిపుణులు అంటున్నారు. ఈ సమస్యలు ఎక్కువగా ఉంటే కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. మారుతున్న వైరస్ తో పాటు లక్షణాలూ మారుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.