విమానంలో కరోనా బాధితుడు ..కాక్ పిట్ నుండి దూకేసిన పైలెట్ !

Update: 2020-03-24 10:10 GMT
కరోనా వైరస్ .. ఈ పేరు వింటేనే ఇప్పుడు ప్రతి ఒక్కరు జంకుతున్నారు. చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన ఈ కరోనా వైరస్ .. అక్కడిక్కడి నుండి ఒక్కో దేశానికీ వ్యాప్తి చెందుతూ ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ఈ కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 16 వేల మందికి పైగా మృతి చెందారు. అలాగే 3.5 లక్షల మంది కరోనా భారిన పడ్డారు. దీనితో ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతుంది. చివరికి అనుమానిత కరోనా వైరస్ వ్యాధి అనుమానిత రోగులు విమానంలో ప్రయాణిస్తున్నారనే భయంతో పైలెట్లు హడలిపోతున్నారు.

తాజాగా కరోనా వైరస్ వ్యాధి అనుమానిత రోగి విమానంలో ప్రయాణిస్తున్నాడని సమాచారం అందిన వెంటనే ఆ విమానం పైలెట్ ఆందోళకు గురై - కాక్ పిట్ లో నుంచి దూకేశాడు. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో జరిగింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..ఈనెల 20వ తేదీన పూణే నుంచి ఢిల్లీకి 15-732 ఎయిర్ ఏసియా విమానం ప్రయాణించింది. ఈ ఎయిర్ ఏసియా విమానంలో ప్రయాణికులు చాలా మంది ఉన్నారు. ఎయిర్ ఏసియా విమానం ప్రయాణించినప్పటికే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాధుల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. ఆ విమానంలో కరోనా వైరస్ వ్యాధి అనుమానిత రోగి ప్రయాణిస్తున్నాడని, తన ముందు సీటులోనే ఆ రోగి కుర్చున్నాడని ఆ విమానం పైలెట్ కు తెలిసింది. అంతే అప్పటి నుంచి విమానం పైలెట్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ విమానం ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ వరకు తీసుకువచ్చాడు.

అయితే , ఈ విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు - ఎయిర్ పోర్ట్ లోని మారుమూల ప్రాంతంలో విమానం నిలపాలని పైలెట్ కు సూచించారు. అధికారుల సూచన మేరకు విమానం ల్యాండ్ అయిన తరువాత ఎయిర్ పోర్టు మారుమూల ప్రాంతానికి విమానంని తీసుకెళ్లారు. విమానంలోని కరోనా వైరస్ అనుమానిత ప్రయాణికుడికి వైద్యపరీక్షలు నిర్వహించడంతో నెగిటివ్ అనే తేలింది. అనంతరం విమాన ప్రయాణికులు - సిబ్బందిని ముందు ద్వారం నుంచి కాకుండా వెనుక ద్వారం నుంచి కిందకు దించారు. ఆ సమయంలో పైలెట్ విమానం దిగకుండా చాలా సేపు క్యాబిన్ లో సెల్ఫ్ క్వారెంటైన్ విధించుకున్నాడు. తరువాత ఒక్కసారిగా విమానంలోని కాక్ పిట్ లోని కిటికీలో నుంచి కిందకు దూకేసిన పైలెట్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు పరుగు తీశాడు. మొత్తం మీద ఎక్కడ కరోనా వైరస్ వ్యాధి సోకుతుందో అనే భయంతో పైలెట్ ఆందోళన చెంది కాక్ పిట్ నుంచి కిందకు దూకేశాడని ఆలస్యంగా విషయం వెలుగు చూడటంతో అది కాస్త వైరల్ అయ్యింది.





Tags:    

Similar News