లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని వారి స్వస్థలాలకు పంపేందుకు వీలుగా కేంద్రం ఓకే అనటం తెలిసిందే. ఈ ప్రయాణాలకు సంబంధించిన డిటైల్డ్ ప్లాన్ చెప్పకున్నా.. ఆయా రాష్ట్రాలు మాట్లాడుకొని కార్మికులు.. వలసకూలీల్ని తరలించాలని కేంద్రం చెప్పింది.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. తమ రాష్ట్రంలో చిక్కుకు పోయిన వివిధ రాష్ట్రాల వారిని వారి స్వస్థలాలకు పంపేందుకు ఉచితంగా ట్రావెల్ చేసేలా నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంతే కాదు.. ఏపీలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మధ్య ప్రయాణాల్ని సైతం ఉచితమేనని తేల్చారు.
ఏపీలో చిక్కుకుపోయిన వారిని వారి రాష్ట్రాల్లో దించేందుకు వీలుగా బస్సుల్ని నడపనున్న ఏపీ సర్కారు.. ఇందుకు సంబంధించిన సంప్రదింపుల్ని షురూ చేసినట్లుగా చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఏపీ కార్మికులు.. ఉద్యోగులు.. విద్యార్థులు.. యాత్రికులు కోవిడ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
ఇతర ప్రాంతాల్లో చిక్కుకు పోయిన ఆంధ్రోళ్లు 0866-2424680 నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యను చెబితే.. ప్రయాణ ఏర్పాట్లు చేస్తారని చెబుతున్నారు. ఫోన్ సాధ్యం కాకుంటే.. apcovid19controlroom@gmail. com మెయిల్ ద్వారా సమాచారం అందిస్తే.. ఏపీ ప్రజల్ని ఆదుకుంటామని చెబుతున్నారు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 71 పాజిటివ్ కేసులు నమోదైతే.. మొత్తం బాధితుల సంఖ్య 1403కు చేరింది. ఇప్పటి వరకూ 321 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఎప్పటిలానే కర్నూలు లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్క రోజులోనే కర్నూలు లో 43 కేసులు నమోదు కావటం గమనార్హం.