కరోనా వైరస్ పుట్టుకకి కారణమైన చైనా లో మళ్లీ కరోనా పడగ విప్పుతుంది. డ్రాగన్ దేశంలో ఐస్ క్రీంలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని తేలింది. ఐస్ క్రీమ్ శాంపిల్స్ పరీక్షించగా కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయని చైనా వైద్యాధికారులు తెలిపారు. దాదాపు 4,800 ఐస్ క్రీమ్ బాక్సుల్లో కరోనా వైరస్ ఉందని నిర్ధారించారు. ఈ ఐస్ క్రీమ్ తిన్నవారిలో ఎంతమందికి వైరస్ సోకిందో ట్రేస్ చేస్తున్నారు వైద్యాధికారులు. ఈశాన్య దేశమైన చైనాలో టియాజిన్ మున్సిపాలిటీ ప్రాంతంలో స్థానికంగా తయారు చేసిన ఐస్ క్రీం కంటెంట్ నుంచి మూడు శాంపిల్స్ అధికారులు సేకరించి ల్యాబ్ కు పంపారు. ఐస్ క్రీంలో కరోనా కలుషితమైనట్టు నిర్ధారించినట్టు వెల్లడించారు.
టియాంజిన్ డాకియాడో అనే ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్ క్రీం బాక్సుల్లో కరోనా కలుషితమైనట్టు గుర్తించారు. ఇప్పటికే స్టోరేజీలో ఉంచిన 2,089 ఐస్ క్రీం బాక్సులకు అధికారులు సీల్ వేశారు. మిగిలిన 1,812 ఐస్ క్రీం బాక్సులను ఇతర ప్రావిన్స్ లకు పంపిణీ చేయగా, మరో 935 ఐస్ క్రీం బాక్సులు స్థానిక మార్కెట్లోకి వెళ్లిపోయాయి. కానీ, ఇప్పటివరకూ కేవలం 65 బాక్సులు మాత్రమే విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. 450గ్రాముల ఐస్ క్రీం బాక్సుల్లో ఉక్రేయిన్ నుంచి తెచ్చిన మిల్క్ ఫౌడర్, న్యూజిలాండ్ నుంచి వెన్నప్రోటీన్ వాడినట్టు వైద్యాధికారులు గుర్తించారు.
ఈ ఐస్ క్రీంలను ఎవరెవరు తిన్నారో ట్రేస్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 1,662 మంది కంపెనీ ఉద్యోగులను సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. అలాగే కరోనా పరీక్షలు కూడా చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఐస్ క్రీం ఫ్యాక్టరీలో శానిటైజేషన్, సరైన పారిశుధ్యం లేకపోవడం కారణంగానే వైరస్ వ్యాపించినట్టు గుర్తించారు. అందులోనూ ఐస్ క్రీంను ఫ్యాట్ తో తయారుచేస్తారు.