కంటికి కనిపించని శత్రువుతో పోరాడేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి? అలిసిపోయామనో.. ఆర్థిక పరిస్థితి బాగోలేదనో? మరేదైనా కారణంగా యుద్ధానికి కాస్తంత విరామం ఇస్తే అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏ చిన్న అవకాశం ఇచ్చినా చెలరేగిపోయి.. చొచ్చుకుపోయే గుణం ఉన్న కరోనా విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అందుకు భిన్నంగా చోటు చేసుకునే చిన్న తప్పులే.. పెద్ద నష్టాన్ని తీసుకొస్తాయి. దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ 2.0కు కాసిన్ని మినహాయింపులు ఇస్తూ మార్గదర్శకాలు విడుదల చేసిన మోడీ సర్కారు పుణ్యమా అని.. చిత్రమైన పరిస్థితి నెలకొంది.
కేంద్ర మార్గదర్శకాలకు తమ సొంత నిర్ణయాల్ని తీసుకున్న రాష్ట్రాల తీరు ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగానే ఉన్న ఉత్తరప్రదేశ్.. రాజస్థాన్.. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు లాక్ డౌన్ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ.. సొంత నిర్ణయాలు తీసుకున్నాయి. పరిమిత సంఖ్యలో అనుమతులు ఇచ్చినట్లు చెబుతున్నా.. రోడ్ల మీదకు జనాలు ఎగబడిన తీరు దేశానికి పెను ముప్పుగా మారనుందా? అన్నదిప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
పరిమిత సంఖ్యలో షాపులు తెరుచుకోవటానికి అనుమతులు ఇవ్వటం తో రోడ్ల మీద జనసంచారం పెరిగిపోయింది. దీంతో.. లాక్ డౌన్ కు మినహాయింపులు ఇచ్చిన ఆరురాష్ట్రాలపై కేంద్రం గుర్రుగా ఉంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో (కర్ణాటక.. తమిళనాడు.. ఢిల్లీ) లాక్ డౌన్ ను మే మూడు వరకూ ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి. తెలంగాణలో అయితే మే ఏడు వరకూ లాక్ డౌన్ అమలు చేస్తామని ఆదివారమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేయటం తెలిసిందే.
వీరికి భిన్నంగా లాక్ డౌన్ ను సడలిస్తూ సొంత నిర్ణయాలు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్.. రాజస్థాన్.. మధ్యప్రదేశ్.. కేరళ.. గోవా..పశ్చిమబెంగాల్ లు ఉన్నాయి. గోవాలో ఒక్క పాజిటివ్ కేసు లేకపోవటంతో లాక్ డౌన్ ను ఎత్తేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే రీతిలో పాజిటివ్ కేసుల్ని గణనీయంగా తగ్గించటంతో పాటు.. కరోనాను కట్టడి చేసే విషయంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన స్థాయిలో ఉన్న కేరళలో లాక్ డౌన్ ను సడలిస్తూ నిర్ణయం తీసుకోవటం ఫర్లేదనిపించినా.. కేసుల నమోదు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సైతం లాక్ డౌన్ కు మినహాయింపు ఇవ్వటం దేశానికి పెను ముప్పుగా మారుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా..కరోనా వేళ కంట్రోల్ గా వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.